Monday, April 29, 2024

డ్రోన్ దాడితో దెబ్బతిన్న క్రిమియా పవర్ ప్లాంట్

- Advertisement -
- Advertisement -

Drone attack

మాస్కో: ద్వీపకల్పంలోని థర్మల్ పవర్ ప్లాంట్ లక్ష్యంగా డ్రోన్ దాడి జరిగిందని క్రిమియాలోని రష్యా అధికారులు తెలిపారు. అయితే థర్మల్ ప్లాంట్ దెబ్బతినలేదని కూడా వారు స్పష్టం చేశారు. “నేటి రాత్రి మానవరహిత వైమానిక వాహనం(యుఏవి) బలక్లావా థర్మల్ విద్యుత్ కేంద్రంపై దాడి చేసింది” అని రష్యా నియుక్తించిన సెవస్తోపోల్ గవర్నర్ మిఖైల్ రజ్వోజయేవ్ టెలిగ్రాం ద్వారా తెలిపారు. “ట్రాన్స్‌ఫార్మర్ కొద్దిగా దెబ్బతిన్నది, ఎలాంటి ప్రాణ హానీ జరుగలేదు” అని ఆయన తెలిపారు. “విద్యుత్ సరఫరాకు ఎలాంటి డోకాలేదు” అని అధికారులు భరోసా ఇచ్చారు. “విద్యుత్ కేంద్రంలో ఉన్న కార్మికులు వెంటనే చర్యలు తీసుకుని మంటలను ఆర్పేశారు” అని సెవస్తోపోల్ మిఖైల్ రజ్వోజయేవ్ తెలిపారు. “దాడి జరిగినప్పుడు ట్రాన్స్‌ఫార్మర్ మంటలంటుకుంది, అయితే సెవస్తోపోల్ , ద్వీపకల్పానికి ఎలాంటి విద్యుత్ అంతరాయాన్ని కలిగించలేదు” అని స్పష్టం చేశారు. ఉక్రెయిన్‌పై దాడి జరిపిన మాస్కో దళాలు ఆ దేశ విద్యుత్ సరఫరాను దెబ్బతీశాయి. ఉక్రెయిన్ నుంచి 2014లో రష్యా క్రిమియాను స్వాధీనం చేసుకుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News