Monday, April 29, 2024

పంటల వారీగా రైతు బృందాలు

- Advertisement -
- Advertisement -

 

హైదరాబాద్: పంటల వారీగా రైతులను గుర్తించి గ్రూపులను (రైతు బృందాలు) ఏర్పాటు చేయాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. మామిడి ఎగుమతులు పెరగాలని, ఆయిల్ పామ్ తోటల సాగు ఉదృతం చేయాలన్నారు. పబ్లిక్ గార్డెన్ లో 71వ గణతంత్ర దినోత్సవ వేడుకలకు హాజరైన మంత్రి ఉద్యాన శాఖ కమీషనర్ కార్యాలయంలో హార్టికల్చర్, సెరికల్చర్ శాఖలపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతులను చైతన్యపరిచి పంటలమార్పిడికి ప్రోత్సహించాలని పేర్కొన్నారు. సేంద్రీయ సాగుకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు.

నాణ్యమైన పండ్ల తోటల సాగు పెరగాలని, క్రాప్ కాలనీలలో కూరగాయల పంటల సాగు పెంచాలన్నారు. మల్బరీ సాగుతో అధిక ఆదాయం వస్తుందన్నారు. అధిక ఆదాయం ఇచ్చే నూతన పంటలైన వెదురు, శ్రీ గంధం సాగు విస్తృతం కావాలన్నారు. 2021 వార్షిక ప్రణాళిక పూర్తిచేసి వెంటనే ప్రభుత్వానికి నివేదిక అందించాలన్నారు. పబ్లిక్ గార్డెన్ లో ప్రజలకు అహ్లాదం కలిగించేలా పచ్చదనాన్ని పెంపొందించే మొక్కలు నాటాలని ఆదేశించారు. అధిక ఆక్సిజన్ విడుదల చేసే వెదురు తరహా మొక్కలు అభివృద్ది చేయాలన్నారు. పబ్లిక్ గార్డెన్‌లో పర్యటించి పచ్చదనం పెంచాలని ఆదేశించారు.

Crop wise farmer groups
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News