Saturday, May 4, 2024

నాటి దాడిని మరచిపోలేదు.. క్షమించేది లేదు

- Advertisement -
- Advertisement -

pulwama-attack

న్యూఢిల్లీ: జమ్మూ కశ్మీరులోని పుల్వామాలో ఉగ్రవాదాలు జరిగిన బాంబు దాడిలో 40 మంది జవాన్లు మరణించి ఏడాది అయిన సందర్భంగా అమర జవాన్లను సంస్మరిస్తూ సిఆర్‌పిఎఫ్ శుక్రవారం ఒక ట్వీట్ పోస్ట్ చేసింది. అర్ధరాత్రి 12 గంటలకు పోస్ట్ చేసిన ఈ ట్వీట్‌లో ఉగ్ర దాడిని తాము క్షమించబోమని లేదా మరచిపోయేది లేదని సిఆర్‌పిఎఫ్ స్పష్టం చేసింది. దేశ సేవలో తమ ప్రాణాలను పుల్వామాలో త్యాగం చేసిన మా సోదరులకు సెల్యూట్ చేస్తున్నామని, అమర జవాన్ల కుటుంబాలకు అండగా నిలబడతామని ఆ ట్వీట్‌లో పేర్కొంది. పాకిస్తాన్ మద్దతుగల జైషే మొహమ్మద్‌కు చెందిన ఆత్మాహుతి దళ సభ్యుడొకడు 2019 ఫిబ్రవరి 14న పుల్వామాలో మందుగుండు సామగ్రితో వెళుతున్న సిఆర్‌పిఎఫ్ కాన్వాయ్‌పై దాడి చేసి పేల్చివేయగా 40 మంది సిఆర్‌పిఎఫ్ జవాన్లు మరణించారు.

CRPF salutes Pulwama Martyrs, We did not forget, we did not forgive, says CRPF in a tweet

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News