Saturday, April 27, 2024

వాలెట్లే సైబర్ నేరస్తుల టార్గెట్

- Advertisement -
- Advertisement -

Cyber---criminals

 వాలెట్లే సైబర్ నేరస్తుల టార్గెట్
బాధితుల్లో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లే ఎక్కువ
8,500మంది బాధితుల ఫిర్యాదు

హైదరాబాద్: కరోనా సమయంలో సైబర్ నేరస్తులు ఇ-వాలెట్లను లక్ష్యంగా చేసుకుని దోచుకున్నారు. లాక్‌డౌన్ విధించడంతో చాలామంది ఇళ్ల నుంచే పనిచేశారు. బయటికి వెళ్లకుండా ఉండి ఆల్‌లైన్ ద్వారా పేమెంట్ చేయడం ఎక్కువగా ఉపయోగించుకుంటున్నారు. దీనిని సైబర్ నేరస్తులు క్యాష్ చేసుకున్నారు. వివిధ రకాల పేర్లు చెప్పి దోచుకున్నారు. వివిధ రకాల పేర్లు చెప్పడంతో నమ్మి నిండా మునిగారు.

డబ్బలు పోగొట్టుకున్న బాధితులు సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ విధంగా సైబరాబాద్ సైబర్ క్రైం పోలీసులు కరోనా కాలంలో 8,500మంది బాధితులు ఫిర్యాదు చేశారు. ఇందులో ఎక్కువగా సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లు ఉన్నారు. వీరు ఇప్పటి వరకు 1.5కోట్ల రూపాయలు పోగొట్టుకున్నారు. సైబర్ నేరస్తులు వాలెట్‌ను అప్‌డేట్ చేయాలని, కెవైసిని ఆన్‌లైన్‌లో పూర్తి చేసి తమకు పంపించాలని చెప్పడంతో నమ్మి సైబర్ నేరస్తులు చెప్పినట్లు చేయడంతో డబ్బులు పోగొట్టుకున్నారు.

ఫోన్ చేసి మేము మీకు లింక్ పంపిస్తామని, దానిని పూర్తి చేసి పంపించాలని, తర్వాత పిన్‌నంబర్, యుపి నంబర్ పంపించాలని చెప్పడంతో చాలామంది వారు చెప్పినట్లు చేస్తున్నారు. వీటిని తీసుకున్న సైబర్ నేరస్తులు వాలెట్ల నుంచి డబ్బులు దోచుకుంటున్నారు. ముఖ్యంగా కరోనా టైంలో పేటిఎం యాప్‌ను ఉపయోగిస్తున్న వారిని టార్గెట్ చేసుకుని దోచుకున్నారు. సైబర్ క్రైం పోలీసులకు వచ్చిన ఫిర్యాదుల్లో ఎక్కువగా ఇవే ఉన్నాయి. పేటిఎం కెవైసి పూర్తి చేయాలని చెప్పడంతో బాధితులు చేస్తున్నారు.

అంతేకాకుండా వారికి పంపించడంతో పాటు ఒటిపిని కూడా చెప్పడంతో వాటి ఆధారంగా సైబర్ నేరస్తులు డబ్బులు తమ ఖాతాల్లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకుంటున్నారు. కొందరు పేటిఎం నుంచి ఫోన్ చేస్తున్నామని మీ పిన్ నంబర్, క్రెడెన్షియల్స్ చెప్పాలని కోరడంతో నమ్మిన ఓ బాధితుడు అన్ని వివరాలు చెప్పిన తర్వాత రూ.1.5లక్షలు పోగొట్టుకున్నాడు. తన ఖాతా నుంచి డబ్బులు విత్ డ్రా కావడంతో లబోదిబో అంటూ సైబర్ క్రైం పోలీసులను ఆశ్రయించాడు.

యాప్‌లు, నెట్ బ్యాంకింగ్ క్రెడెన్షియల్స్ ఎవరికీ చెప్పవద్దని సైబర్ క్రైం పోలీసులు చెబుతున్నా ప్రజలు మారడం లేదు. అనుమానిత మెసేజ్‌లు ఓపెన్ చేయవద్దని, బ్యాంక్‌కు సంబంధించిన వివరాలు పూర్తి చేయవద్దని కోరుతున్నా వినడంలేదు. బాధితుల్లో ఎక్కువగా ఐటి నిపుణులు ఎక్కువగా ఉంటున్నారు. వీరిక సాంకేతిక పరిజ్ఞనం ఎక్కువగా ఉంటుంది అయినా కూడా సులభంగా సైబర్ నేరస్తులకు చిక్కి డబ్బులు పోగొట్టుకుంటున్నారు. ఏ బ్యాంక్ కెవైసి కోసం ఫోన్ చేయరని, ఒటిపి, క్రెడెన్షియల్స్ వివరాలు అడుగరని పోలీసులు చెబుతున్నా చాలామంది మారడంలేదు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News