Monday, April 29, 2024

ఉద్యోగులకు డిఎ, పెన్షనర్లకు డిఆర్ విడుదల

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : తెలంగాణ ఆవిర్భావ దశాబ్ధి ఉత్సవాల సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వోద్యోగులు, పెన్షనర్లకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. సిఎం కెసిఆర్ ఆదేశాలకు అనుగుణంగా డిఎ/ డిఆర్ విడుదల చేయాలని నిర్ణయించినట్లు రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు సోమవారం ట్వీట్ చేశారు.

బేసిక్ పే / పెన్షన్‌పై 2.73% విడుదల చేయనున్నది. ఇది జూన్ 2023 నుండి అమల్లోకి వస్తుంది. జూలై 2023లో వేతనంతో కలిపి చెల్లించబడుతుంది. ఈ నిర్ణయంతో రూ.1380.09 కోట్ల అరియర్స్ చెల్లింపుతో పాటు నెలకు రూ.81.18 కోట్లు, సంవత్సరానికి రూ.974.16 కోట్ల అదనపు భారం ప్రభుత్వం పై పడనున్నది. ఉద్యోగులు, పెన్షనర్లు కలిపి మొత్తం 7.28 లక్షల మందికి ప్రయోజనం చేకూరనుంది. ఉద్యోగులకు డిఎ, పెన్షనర్లకు డిఆర్ విడుదల పట్ల పి ఆర్ టి యు టిఎస్ హర్షం వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా పిఆర్టియుటిఎస్ రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు పింగళి శ్రీపాల్ రెడ్డి, బీరెల్లి కమలాకర్‌రావులు సిఎం కెసిఆర్‌కు, ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావుకు ధన్యవాదాలు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News