Monday, May 6, 2024

విజృంభిస్తున్న కరోనా.. సిఆర్‌పిఎఫ్ హెడ్‌క్వార్ట‌ర్స్‌ మూసివేత

- Advertisement -
- Advertisement -

 

న్యూఢిల్లీ‌: దేశంలో క్రమంగా కరోనా వైరస్ పంజా విసురుతుంది.తాజాగా కరోనా కారణంగా ఢిల్లీలోని సిఆర్‌పిఎఫ్ హెడ్‌క్వార్ట‌ర్స్‌ను సీజ్ చేశారు. మే 5వ తేదీ, మంగళవారం వరకు కార్యాలయాన్ని మూసివేయాలని సిఆర్‌పిఎఫ్ డైరెక్టరేట్ జనరల్ ఆదేశించారు. కార్యాల‌యంలో ప‌నిచేసే ఓ వ్య‌క్తికి కోవిడ్-19 పాజిటివ్ రావ‌డంతో బిల్డింగ్ మొత్తం శానిటైజేష‌న్ చేసేందుకు హెడ్‌క్వార్ట‌ర్స్‌ను మూసివేశారు. కరోనా నేపథ్యంలో 40 మంది ఆఫీస‌ర్స్, సిబ్బందితోపాటు స్పెష‌ల్ డైర‌క్ట‌ర్ జ‌న‌ర‌ల్ ర్యాంక్ ఆఫీస‌ర్, డిప్యూటీ ఇన్ స్పెక్టర్ జనరల్ ను హోమ్ క్వారెంటైన్‌కు పంపారు. ఇక, శానిటైజేష‌న్ పూర్తి అయ్యేంతవ‌ర‌కు హెడ్‌క్వార్ట‌ర్స్‌ను మూసి ఉంచ‌నున్నారు. కాగా, దేశవ్యాప్తంగా శనివారం వ‌ర‌కు మొత్తం 136 మంది సిఆర్‌పిఎఫ్ జ‌వాన్ల‌కు క‌రోనా సోకింది. ఇందులో ఢిల్లీలోని ఒకే బెటాలియ‌న్ కు చెందిన 135 మంది ఉన్నారు. మరో 22 మంది పరీక్ష ఫలితాలు రానుండడంతో ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.

Delhi CRPF headquarters sealed as staff tests positive

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News