Wednesday, May 1, 2024

ఢిల్లీలో రెండవ దశ కరోనా ఉధృతి

- Advertisement -
- Advertisement -

Delhi Has Already Peaked In Corona 2nd Wave Say Kejriwal

రానున్న రోజుల్లో తగ్గనున్న కేసులు
ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ వెల్లడి

న్యూఢిల్లీ: ప్రస్తుతం ఢిల్లీలో కరోనా వైరస్ రెండవ దశ ఉధృతి కొనసాగుతోందని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తెలిపారు. రానున్న రోజుల్లో కరోనా కేసులు తగ్గుముఖం పడతాయని నిపుణులు భావిస్తున్నట్లు కూడా ఆయన చెప్పారు.  ఢిల్లీలో జులై 1 నుంచి ఆగస్టు 17 వరకు కరోనా వైరస్ కేసులు అదుపులో ఉన్నాయని గురువారం నాడిక్కడ మీడియాతో మాట్లాడుతూ ఆయన తెలిపారు. సెప్టెంబర్ 17 నాటికి కొత్తగా 4500 కేసులు నమోదైనట్లు గుర్తించామని ఆయన అన్నారు. ఢిల్లీని తాకిన కరోనా వైరస్ రెండవ దశ ఉధృతి ప్రస్తుతం ఉచ్ఛస్థాయిలో ఉందని, త్వరలోనే దీని తీవ్రత తగ్గి రానున్న రోజుల్లో కేసులు తగ్గుముఖం పడతాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

దేశ రాజధానిలో రోజువారీ కొవిడ్-19 నమూనా పరీక్షల సంఖ్యను కూడా పెంచామని కేజ్రీవాల్ తెలిపారు. గతంలో రోజుకు 20,000 పరీక్షలు జరపగా ఇప్పుడు 60,000 పరీక్షలు జరుపుతున్నామని ఆయన చెప్పారు. పెద్ద సంఖ్యలో కరోనా కేసులు నమోదైనపుడు కేంద్ర ప్రభుత్వం, ఎన్‌జీవో, ఢిల్లీ ప్రజల సహాయంతో వాటిని నియంత్రించగలిగామని, అందుకు ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలియచేసుకుంటున్నానని ఆయన చెప్పారు. కొవిడ్-19 కట్టడిపై ప్రధానితో జరిగిన ఉన్నత స్థాయి వీడియో సమావేశం గురించి మాట్లాడుతూ అది ఫలప్రదంగా జరిగిందని చెప్పారు. బుధవారం నాటికి ఢిల్లీలో మొత్తం 2,56,789 కరోనా కేసులు నమోదు కాగా అందులో 2,20,866 రికవరీలు ఉన్నాయి. 5,087 మంది ఇప్పటివరకు వైరస్ కాటుకు బలయ్యారని రాష్ట్ర ఆరోగ్య శాఖ తెలిపింది.

Delhi Has Already Peaked In Corona 2nd Wave Say Kejriwal

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News