Monday, April 29, 2024

ప్రయాణికుల కష్టాలకు చెక్

- Advertisement -
- Advertisement -

TSRTC bus services resume in Hyderabad

హైదరాబాద్: నగరంలో సిటీబస్సులు నడిపేందుకు అధికారులు సిద్దం అవుతున్నారు. మంగళవారం ప్రయోగత్మాకంగా శివారు ప్రాంతాల్లో 235 బస్సులను అధికారులు నడపడంతో ప్రయాణికుల నుంచి మంచి స్పందన వచ్చింది. దాంతో గ్రేటర్ వ్యాప్తంగా బస్సులను నడిపేందుకు ప్రణాళికలు సిద్దం చేస్తున్నారు. మొదటలో దశలో 50 శాతం బస్సులు నడిపేందుకు అధికారులు సమాయత్తం అవుతున్నారు. మొదటి దశలో బస్సులు తిరిగిన అనంతరం ప్రయాణికులు, అధికారులు అభిప్రాయాలను ఆధారంగా ఈ ఈ నెలాఖరులోగా బస్సులను పూర్తి స్థాయిలో తిప్పేందుకు అధఠికారులు సిద్దం అవుతన్నారు. ఇప్పటికే ఈ అంశంపై ఉన్నతాధికారులు కింది స్థాయిలో అధికారులను సిద్దంగా ఉండాలని సమాచారం అందించారు.

అయితే మొదటి దశలో ఏ రూట్లలో బస్సులను నడపాలి.. ఏ డిపోల నుంచి ఎన్ని బస్సులను సిద్దంగా ఉంచాలి అనే అంశాలను ఇప్పటికే అధికారులు డివీఎంలు, డిపోమేనేజర్ల నుంచి సమాచారం తీసుకున్నారు. సమారు 15 రోజుల కిత్రమే నగరంలోని అన్ని ప్రధాన మార్గల్లో మెట్రో నడుస్తుండంతో ఆయా మార్గాల్లో బస్సులను ఎన్ని తిప్పాలి.. ఆయా మార్గాల్లో బస్సుల సంఖ్యను గతంలో మాదిరిగానే ఉంచాలా లేదా అనే అంశంపై అధికారులు ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. మొదటి దశలో ప్రధానంగా శివారు ప్రాంతాల నుంచి రైల్వేస్టేషన్లు, బస్టేషన్లు, ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాలను, ఆసుపత్రులను అనుసంధానం చేస్తూ బస్సులను తిప్పితే వచ్చే అటు ప్రయాణికులకు రవాణా సౌకర్యం కల్పించినట్లు ఉండటమే కాకుండా ఉద్యోగులకు కూడా ప్రయోజనం కరంగా ఉంటుందనే అభిప్రాయాన్ని అధికారులు వ్యక్తం చేసినట్లు సమాచారం. కోవిడ్ నిబంధనలపై ఇప్పటికే అధికారులకు, అటు ప్రయాణికులకు అవగాహన ఉండటంతో ఎటువంటి సమస్యలు రావనే అభిప్రాయాన్ని అధికారులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అయితే డిపోలకు విధులకు హజరే అయ్యే సిబ్బంది కి ప్రతి రోజు థర్మల్ స్క్రీనింగ్ చేయడమే కాకుండా, బస్సులను పూర్తిస్థాయిలో శానిటైజ్ చేసిన తర్వాత డిపోల నుంచి బయటకు వెళ్ళేందుకు అనుమతి ఇస్తామని అధికారులు చెబుతున్నారు.

డిమాండ్‌కు అనుగుణంగా శివారు ప్రాంతాల్లో బస్సుల సంఖ్యను పెంచుతాం..

శివారు ప్రాంతాల్లోని డిపోల నుంచి బస్సులకు తిప్పడంతో ప్రయాణికుల తోలిరోజు నుంచే మంచి స్పందన వచ్చిందని , డిమాండ్‌ను అనుసరించి బస్సులను సంఖ్యను పెంచుతామని అధికారులు చెబుతున్నారు. ముఖ్యంగా రాత్రి సమయాల్లో బస్సులు అందుబాటులో లేక పోవడంతో ప్రయాణికులు ఇబ్బంది పడుతున్న అంశంపై మా దృష్టికి వచ్చిందని త్వరలో రాత్రి సమయంలో ట్రిప్సుల సంఖ్యను పెంచే అంశాన్ని కూడా పరిశీలిస్తున్నామంటున్నారు. త్వరలో శివారు ప్రాంతాల నుంచి నగర నడిబొడ్డుకు వచ్చే బస్సులను పునరుద్దరిస్తామని అధికారులు చెబుతున్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News