Thursday, May 9, 2024

కోల్‌కతా కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకున్న దినేష్ కార్తీక్

- Advertisement -
- Advertisement -

Dinesh Karthik resigns as Kolkata captain

 

హైద‌రాబాద్‌: దినేశ్ కార్తీక్ కోల్‌క‌తా నైట్ రైడ‌ర్స్ కెప్టెన్సీ బాధ్య‌త‌ల నుంచి త‌ప్పుకున్నాడు. ఈ మేరకు కోల్‌కతా మేనేజ్‌మెంట్‌కు సమాచారం అందించాడు. దుబాయ్‌లో జ‌రుగుతున్న ఐపిఎల్ టోర్నీలో కోల్‌క‌తా జ‌ట్టుకు దినేశ్ కార్తీక్ నాయ‌క‌త్వం వ‌హిస్తున్న విష‌యం తెలిసిందే.  నేటీ నుంచి కోల్‌క‌తా నైట్ రైడ‌ర్స్ జ‌ట్టు కెప్టెన్సీ బాధ్య‌త‌లు ఇంగ్లండ్ క్రికెట‌ర్ ఇయాన్ మోర్గన్ చూసుకోనున్నాడు.  ఇవాళ ముంబై ఇండియ‌న్స్‌తో కోల్‌క‌తా నైట్ రైడ‌ర్స్ మ్యాచ్ ఆడ‌నున్న‌ది.  బ్యాటింగ్‌పై ఫోక‌స్ పెట్టాల‌న్న దృష్టితో సార‌థ్యాన్ని వ‌ద‌లుచుకుంటున్న‌ట్లు దినేశ్ వెల్ల‌డించాడు. దినేశ్ కార్తీక్ లాంటి ఆట‌గాళ్లు జ‌ట్టులో ఉండ‌డం మంచిద‌ని, చాలా సాహ‌సోపేత నిర్ణ‌యం తీసుకున్నాడ‌ని సిఇఓ వెంకీ మైసూర్ ఓ ప్ర‌క‌ట‌న‌లో తెలిపారు. ఈ సీజన్ ఆరంభంలో దినేశ్ కార్తీక్ కెప్టెన్సీపై విమర్శలు వచ్చాయి. నరైన్‌కు ఓపెనర్‌గా పదే పదే అవకాశాలు ఇవ్వడం,  జట్టు బ్యాటింగ్ ఆర్డర్ కూర్పు, తన బ్యాటింగ్ అనుకున్న స్థాయిలో లేకపోవడంతో.. కోల్‌కతా అభిమానులు కార్తీక్‌ కెప్టెన్సీపై విమర్శలు గుప్పించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News