Monday, April 29, 2024

షాకింగ్ ఎలిమెంట్స్ సర్ ప్రైజ్ చేస్తాయి: డైరెక్టర్ అనిల్ కన్నెగంటి

- Advertisement -
- Advertisement -

యంగ్ అండ్ ప్రామిసింగ్ హీరో అశ్విన్ బాబు కథానాయకుడిగా అనిల్ కన్నెగంటి దర్శకత్వంలో శ్రీ విఘ్నేష్ కార్తీక్ సినిమాస్ (SVK సినిమాస్) బ్యానర్‌ పై గంగపట్నం శ్రీధర్ నిర్మిస్తున్న హై-వోల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్ ‘హిడింబ’. నందితా శ్వేత కథానాయికగా నటిస్తోంది. ఎకే ఎంటర్‌టైన్‌మెంట్స్ అనిల్ సుంకర ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు. ఇప్పటికే  విడుదలైన ఈ చిత్రం థియేట్రికల్ ట్రైలర్‌, పాటలకు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. జూలై 20న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వస్తున్న నేపథ్యంలో దర్శకుడు అనిల్ కన్నెగంటి విలేకరుల సమావేశంలో చిత్ర విశేషాలని పంచుకున్నారు.

‘హిడింబ’ డిఫరెంట్ జానర్ లో కనిపిస్తోంది ?
ఒక హైబ్రీడ్ జానర్ లో డిఫరెంట్ మూవీ చేయాలని చాలా కాలంగా వుంది. ఇప్పటికే కొన్ని ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్స్ ని ఆడియన్స్ చూశారు. మళ్ళీ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ ని ఆడియన్స్ చూడాలంటే ఏదో కొత్తదనం కావాలి. వేర్లు మారుతూ వెళ్ళాలి. ఇంటర్వెల్ తర్వాత జోనర్ షిఫ్ట్ ఐతే కొత్త అనుభూతి వస్తుందని అనిపించింది. ఈ సినిమా చేయడానికి కారణం సెకండ్ హాఫ్. సెకండ్ హాఫ్ లో అన్ డాక్యుమెంటెడ్ హిస్టరీ వుంటుంది. చాలా మందికి తెలియంది, తాతలు తండ్రుల ద్వారా కేవలం వినడమే తప్పితే చరిత్రలో ఎక్కడా రాసివుండని కొన్ని అంశాలు వుంటాయి. అలాంటి ఓ పాయింట్ ఓ చోట విన్నాను. దానికి కొంత కల్పన జోడించి, ట్రెండ్ కి తగ్గట్టు తీసిన సినిమా ఇది.

ఇప్పుడు మైథాలజీ కంటెంట్ కి ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అవుతున్నారు. కాంతార, బింబిసార, విరూపాక్ష ఇలాంటి సౌండింగ్ వుంటే ఆడియన్స్ కి వెంటనే కనెక్టింగ్ అవుతుందని అనిపించింది. ఈ సినిమాలో ఒక తెగ వుంది. ఆ తెగకి హిడింబాసురుడి లక్షణాలు కలిగివుంటాయి. ఈ కథకు కూడా ఆ టైటిల్ యాప్ట్ అనిపించి ‘హిడింబ‘ అనే పేరు పెట్టాం. సినిమా చూసిన తర్వాత ఇదే యాప్ట్ టైటిల్ అనిపిస్తుంది. మైథాలజీ తర్వాత ప్రేక్షకులకు బాగా ఆసక్తి చూపించే సబ్జెక్ట్ హిస్టరీ. హిడింబలో చూపించే హిస్టరీ ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని ఇస్తుంది.

ఇది సైకో థ్రిల్లరా ? ట్రైలర్ లో ఆ ఛాయలు కనిపించాయి?  
హిడింబ సైకో థ్రిల్లర్ కాదు. హిస్టారికల్ టచ్ వున్న ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ హిడింబ. అయితే క్రైమ్  ఇన్వెస్టిగేషన్ అనగానే ఒక సైకో ఉంటాడు. వాడు ఎవడు?  ఏం  చేస్తున్నాడనేది కొత్తగా వుండాలి. హిడింబలో చాలా డిటేయిలింగ్ వుంటుంది. చాలా వరకూ బ్లాక్ అండ్ వైట్, రెడ్ లో వుంటుంది . అది ఎందుకు అలా కనబడుతుందనేది ప్రేక్షకులకు చాలా క్యురియాసిటీని కలిగిస్తాయి. ఇంటర్వెల్ బాంగ్ చాలా సర్ప్రైజ్ అవుతారు. సెకండ్ హాఫ్ అంతా చాలా యంగేజింగా వుంటుంది. కేరళ, అండమాన్ లో వచ్చే సన్నివేశాలు ఎక్సయిటింగా వుంటాయి. సినిమా చాలా బాగా వచ్చింది. హిడింబ ప్రేక్షకులకి గొప్ప థియేటర్ ఎక్స్ పీరియన్స్ ఇస్తుంది.

అండమాన్ అనగానే ఒక ఆదిమ తెగ ప్రస్తావన వస్తుంది కదా.. ఇందులో అలాంటి స్ఫూర్తి ఉందా ?
నిజానికి అక్కడ వున్న తెగ వారి  జోలికి వెళితే తిరగబడతారు తప్పితే ప్రమాదం కాదు. వాళ్ళ ప్రపంచం వారిది. ఇందులో మరో పది తెగల గురించి చెప్పి వారి కంటే ప్రమాదకరమైన తెగ ఒకటి వుందని వివరించడం జరుగుతుంది. సౌత్ ఆఫ్రికా లో ఒక తెగ వుంది.  దానిపై కొంత రీసెర్చ్ చేసి దానిని అండమాన్ కి కలిపితే ఎలా ఉంటుందనే ఆలోచన నుంచి అది పుట్టింది.

ఈ కథ ప్రజంట్ లోనే జరుగుతుందా ?
ఇన్వెస్టిగేషన్ అంతా ప్రజంట్ లోనే జరుగుతుంది. కానీ దీనికి లింక్ 1908 నుంచి కాస్త లోతుగా వుంటుంది.

ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ కి మైథాలాజీని పర్ఫెక్ట్ గా ఎలా బెండ్ చేశారు ?
‘హిడింబ’లో ఒక షాకింగ్ పాయింట్ వుంటుంది.  దయచేసిన సినిమా చూసిన వారు ట్విస్ట్ లు ఎవరికీ చెప్పకుండా వుండాలని కోరుతున్నాను. మొన్న సామజవరగమనకి ఇలానే ఎక్కడ స్పాయిలర్స్ ఇవ్వకుండా జాగ్రత్తగా చూశారు. మా సినిమాకి కూడా అలానే చేయాలని కోరుతున్నాను. హిడింబలో స్టన్నింగ్ పాయింట్ వుంది. దాన్ని బలంగా నమ్మి చేశాం.

హీరో అశ్విన్ గురించి ?
ఈ కథకు అశ్విన్ కటౌట్ సరిగ్గా సరిపోతుంది.సినిమా చూడటానికి ప్రేక్షకులు థియేటర్ వరకూ రావాలంటే ఏం చేయాలనేదానిపై అలోచించి ఈ కథని చేసుకున్నాం. అశ్విన్ అద్భుతంగా మేకోవర్ అయ్యారు. మేకింగ్ లో కూడా ఎక్కడా డ్రాప్ అవ్వకుండా అనుకున్నది అనుకున్నట్లు తీశాం. టెక్నికల్ గా హిడింబ చాలా ఇంపాక్ట్ ఫుల్ గా వుంటుంది. నిర్మాతల వైపు నుంచి కూడా నాకు పూర్తి స్వేఛ్చ దొరికింది.

ఇది థ్రిల్లర్ కదా పాటలు అడ్డు అనిపించలేదా ?
రెండు పాటలే వున్నాయి. ఐతే ఈ రెండు పాటలు కథలో భాగంగానే వస్తాయి. ఎక్కడా అవుట్ ఆఫ్ ది బాక్స్ అనిపించదు.

అనిల్ సుంకర గారు రావడం ఈ ప్రాజెక్ట్ కి ఎంతవరకూ హెల్ప్ అయ్యింది ?
అనిల్ సుంకర గారు రావడం చాలా హెల్ప్ అయ్యింది.  నిజానికి ఈ ప్రాజెక్ట్ ముందు ఆయనే చేయాలి. ఐతే ఆయన అమెరికాకి షిఫ్ట్  అవ్వడం వలన కొంత టైం పట్టింది. హిడింబ కంటెంట్ ఆయనకి చాలా నచ్చింది. ఆయన ప్రాజెక్ట్ లోకి వచ్చిన తర్వాత ట్రైలర్ రిలీజ్ కావడం, శాటిలైట్, ఓటీటీ, బిజినెస్ అన్నీ చకచకా జరిగిపోయాయి.

రిలీజ్ ముందే సేఫ్ అయిపోయారా ?
ఫుల్ సేఫ్. ఆల్రెడీ టేబుల్ ప్రాఫిట్ లో వున్నారు నిర్మాతలు. ఇప్పుడున్న రోజుల్లో సినిమా విడుదలకు ముందే నిర్మాతలు ఆనందంగా వుండటం నాకు చాలా సంతోషాన్ని ఇచ్చింది.

హిడింబ నేపధ్య సంగీతం కోసం ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు ?
హిడింబ టెక్నికల్ గా చాలా బ్రిలియంట్ గా వుంటుంది. అశ్విన్ , వికాస్ ని పరిచయం చేశారు. ఆయనకి కథ చెప్పిన తర్వాత థీమ్ మ్యూజిక్ ఇచ్చారు. నాకు చాలా నచ్చింది. ఆయనకి మ్యూజిక్ తప్ప ఏమీ తెలీదు. చాలా అంకితభావంతో పని చేశాడు. అలాంటి టెక్నిషియన్ తో పని చేయడం చాలా ఆనందాన్ని ఇచ్చింది.

కెరీర్ పట్ల ఆనందంగా వున్నారా ?
చిన్నప్పుడు సినిమాల్లోకి వెళితే చాలు అనుకున్నాను. ఇక్కడి వచ్చి దర్శకుడినయ్యాను. ఈ రోజుకీ మిస్టర్ నోకియా సినిమాలో పాట గురించి ఎవరో ఒకరు మెసేజ్ చేస్తూనే వుంటారు. ఇది చాలా ఆనందాన్ని ఇస్తుంది. జయాపజయాలు పక్కన పెడితే సినిమా పరిశ్రమలోనే ప్రయానిస్తున్నామనేది సంతోషాన్ని ఇస్తుంది.

కొత్త ప్రాజెక్ట్స్ గురించి ?
ఎకె ఎంటర్ టైన్ మెంట్స్  లో ఒక సినిమా చేయాలి. అలాగే ఓఎకె లో కూడా ఒకటి వుంది. అలాగే ఈడీ ఎంటర్ టైన్ మెంట్స్ లో ఒక సినిమా వచ్చింది. ఇంకో రెండు ప్రాజెక్ట్స్ చర్చల్లో వున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News