Saturday, April 27, 2024

అన్నార్థుల కడుపు నింపుతున్న అన్నపూర్ణ కేంద్రాలు

- Advertisement -
- Advertisement -

Annapurna centers

 

– గ్రేటర్ పరిధిలో ప్రతి రోజు
– 50వేల ఉచిత భోజనాలు
– మధ్యాహ్నం 35వేలు,
– రాత్రివేళ 15 వేలమందికి అన్నం

మన తెలంగాణ/సిటీబ్యూరో : అన్నార్థుల కడుపు నింపేందుకు ప్రభుత్వం యంత్రాంగం యుద్ద ప్రతిపాదికన పని చేస్తోంది. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావు అదేశాల మేరకు అధికారులు మరిన్ని చర్యలు చేపట్టారు. లాక్‌డౌన్ నేపథ్యంలో ఎవరూ ఆకలితో అలమట్టించకుండా భోజన వసతి కల్పిస్తున్నారు. జిహెచ్‌ఎంసి పరిథిలో ఇప్పటికే అన్నపూర్ణ కేంద్రాల ద్వారా రూ.5లకే భోజనం అందిస్తున్న వ్య వస్థ సమర్థవంతంగా పని చేస్తుండడంతో ఈ విపత్కర పరిస్థితులో అన్నర్థుల కడుపు నింపడంలో కీలక పాత్ర పోషిస్తోంది. రోజుకు అటు ఇటుగా 50 వేల మందికి భోజనం అందిస్తున్నారు. ఇందులో 35 వేలమందికి ఒక పూట మ రో 15 వేల మంది రెండు పూటల ఉచితంగా భోజనం చే యగలుగుతున్నారు. అదేవిధంగా అధికారులు స్వయం గా వంట చేసుకుంటమన్నవారికి బియ్యంతో నిత్యావసర వస్తువులకు కావాల్సిన డబ్బులను సైతం అందజేస్తున్నారు.

అన్నపూర్ణ కేంద్రాల ద్వారా రోజుకు 50వేల బోజనాలు..
జిహెచ్‌ఎంసి ఆధ్వర్యంలో గ్రేటర్ వ్యాప్తంగా 150 అన్నపూర్ణ కేంద్రాల ద్వారా ఉచిత భోజనాలను అందస్తున్నా రు. ఆకలితో ఉన్నవారు ఎవరైన సరే ఈ కేంద్రాల వద్ద ఉ చిత భోజనం అందిస్తున్నారు. గతంలో ఈ కేంద్రాల వద్ద రూ.5ల చెల్లించి ఆటో డ్రైవర్లు, కూలీలు, ఇతర పనుల ని మిత్తం నగరానికి వచ్చే వారితో పాటు ఆసుపత్రుల వద్ద పె షంట్ల సహాయకులు భోజనం చేసేవారు. కరోనా వైరస్ కా రణంగా లాక్‌డౌన్ ప్రకటించడంతో నగరంలో ఒక్కరూ కూడా ఆకలితో అలమట్టించకూడదన్న ముఖ్యమంత్రి ల క్షం మేరకు రూ.5ల బోజనం సరఫరా చేస్తున్న హరే కృ ష్ణ పౌడేషన్ ప్రతినిధులను కలిసి ఎంత మందికైనా భో జ నం ఏర్పాటు చేయాలని బల్దియా మేయర్ బొంతు రామ్మోహన్ కోరడం వారు సుముఖత్త వ్యక్తం చేయడమే కా కుండా అందుకు అనుగుణంగా భోజనాలను సరఫరా చే స్తున్నారు.

ఏలాంటి ఆధారం లేనివారికి ఈ కష్ట కాలంలో అన్నందొరకడమే గగనమనుకున్న సమయంలో 400 గ్రా ముల అన్నంతో పాటు పప్పు, కూర, పచ్చడితో కూడిన నా ణ్యమైన భోజనం ద్వారా వేలాదిమంది తమ కడుపు నిం పుకుంటున్నారు. విద్యార్థులు, వంట చేసుకునే అవకా శం లేనివారితో పాటు అనాధులు, యాచకులు, ఇతర రా ష్ట్రాల నుంచి వచ్చిన వారు ఈ అన్నపూర్ణ కేంద్రాల ద్వారా ఇంటి భోజనంతో సమానమైన పోషకాలు ఉన్న భోజనం తో ఉచితంగా తమ కండుపు నింపుకుంటున్నారు.

మధ్యా హ్నాం 11.30 గంటల నుంచి మధ్యాహ్నాం 3 గంటల వర కు ప్రతి రోజు 150 అన్నపూర్ణ కేంద్రాల ద్వారా 35 వేల మందికి భోజనాలను అందిస్తున్నారు. అదేవిధంగా రాత్రి వేళ్లలో 100 సెంటర్ల ద్వారా 150 వేలమందికి కడుపు ని ండా భోజనం పెడుతున్నారు. గ్రేటర్ పరిధిలో అందరికి భోజనాలు అందేవిధంగా మంత్రి తలసాని శ్రీనివాస్ యా దవ్‌తో పాటు మేయర్, డిప్యూటీ మేయర్, కార్పోరేటర్లను ఎక్కడికక్కడ పర్యటించి ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. వీరితో పాటు పలు స్వచ్చంధ సంస్థలతోపాటు ఆర్ధికంగా వెసలుబాటు ఉన్న పలు కుటుంబాలు, వాణిజ్య కేంద్రాల యజమనులు సైతం ఎక్కడికక్కడ భోజన ఏర్పాట్లు చేస్తున్నారు.

సామాజిక దూరం తప్పని సరి..
అన్నపూర్ణ కేంద్రాల వద్దకు భోజనాల కోసం వచ్చేవారు త ప్పనిసరిగా సామాజిక దూరం పాటించేలా చర్యలు తీసుకుంటున్నారు. దాదాపుగా ప్రతి సెంటర్ల వద్ద 200 నుంచి 400 మందికి ఉచిత భోజనం అందిస్తున్న అధికారులు ఒ క్కరికి ఒక్కరు మీటర్ దూరం పాటించేలా ఏర్పాట్లు చేశా రు. ఇందులో భాగంగా క్యూలైన్లలో ఉన్న ప్రతి ఒక్కరికి భోజనం అందుతుందన్న భరోసా కల్పించడం ద్వారా ఒ క్కరికోక్కరు తోచుకుంట క్రమ పద్దతిలో వచ్చేలా చర్యలు తీసుకున్నారు. ఇందులో భాగంగా ఉదయం 11 గంటల నుంచి 3 గంటల వరకు భోజనాలను అందిస్తున్నారు. దీం తో అందరూ ఒకేసారి కేంద్రాలకు రాకుండా ఆకలి వేసిన వారి వచ్చి ఇంట్లో మాదిరిగా భోజనం చేసి వెళ్లుతున్నారు.

Distribution of food through Annapurna centers
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News