Friday, April 26, 2024

ధాన్యం తరలింపులో అలసత్వం వద్దు

- Advertisement -
- Advertisement -

కొనుగోలు కేంద్రాలపై జిల్లా అధికారులు నిఘా పెంచాలి : మంత్రి నిరంజన్‌రెడ్డి

grain
మన తెలంగాణ/ వనపర్తి : రైతులకు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన మాట నిలబెట్టుకునేలా ప్రతి గింజలు కొనుగోలు చేసి వెంటనే వాటిని తరలించే సదుపాయాలు కల్పించాలని రైతులను ఇబ్బంది పెడితే సహించేది లేదని ప్రభుత్వానికి చెడ్డ చెడ్డ పేరు రాకూడదని రాష్ట్ర వ్యవసాయ శాఖ మాత్యులు సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. సోమవారం హైదరాబాద్‌లోని మంత్రుల నివాస సముదాయం నుండి జూమ్ కాన్ఫరెన్స్‌లో జిల్లాలోని ఆయా నియోజకవర్గ ఆ ఎమ్మెల్యేలు , కలెక్టర్ల, ప్రజా ప్రతినిధులు అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.

ఇటీవల రబీలో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినప్పటికి రైతులతో దాన్యం, కొనుగోలు చేసి వాటి తరలింపులో ఆలసత్వం వహిస్తున్నారు. అన్న ఫిర్యాదుల మేరకు తాను స్పందించడం జరిగిందన్నారు. ధాన్యం కొనుగోలు చేసిన తర్వాత లారీల ద్వారా తరలించే వరకు రైతులు బాధ్యత వహించాల్సి ఉంటుం ది. రోజుల తరబడి ధాన్యం కుప్పలు వద్ద పడిగాపులు కాస్తున్నారని అనేక ఫిర్యాదులు వస్తున్నాయని వెంటనే వాటిని పరిష్కరించేలా అధికారులు, ఎమ్మెల్యేలు చర్యలు చేపట్టాలని సూచించారు. ధాన్యం రవాణాలో జాప్యం జరగకుండా చర్యలు తీసుకోవాలని వీలైనన్ని ఎక్కువ వాహనాలను రవాణాకు వాడుకోవాలన్నారు. మఉఖ్యమంత్రి కేసీఆర్ రైతులకు ఎంతో చేయూతనిచ్చి పంటలు పండించేందుకు ప్రోత్సహిస్తుంటే చిన్న చిన్న తప్పిదాలతో రైతులకు నష్టం కలిగించి ప్రభుత్వానికి చెడ్డ పేరు తేవదన్నారు. క్రాప్ బుకింగ్‌లో నమోదు కాలేదన్న సాకుతో రైతుల ధాన్యం కొనుగోలును తిరస్కరించవద్దనీ క్రాప్ బుకింగ్ సమస్యలుంటే తర్వాత శాఖాపరమైన విచారణ చేసి చర్యలు తీసుకుంటామని సరిహద్దు జిల్లాలలో అప్రమత్తంగా ఉంటే చాలన్నారు.

కొన్ని జిల్లాల నుండి మొక్కజొన్న కొనుగోళ్ల కోసం విజ్ఞప్తులు వస్తున్నాయని ముఖ్యంమత్రి కేసీఆర్ దృష్టికి వి.యాన్ని తీసుకెళ్లి సమస్యలు పరిష్కరించేలా చేస్తానన్నారు. హమాలీల సమస్య తీర్చేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. తరుగు తీసే విషయంలో తరచూ ఫిర్యాదులు వస్తున్నాయి. ఫిర్యాదులు వస్తున్న జిల్లాల మీద కలెక్టర్లు, పౌర సరఫరాల శాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మార్చి 31 లోపు పంటల కోతలు పూర్తయ్యేలా చూసుకుంటే పంట నష్టాలు ఉండవనీ, లేదా వర్షాలు మొదలయ్యి రైతులు నష్టపోయే ప్రమాదం ఉందన్నారు. సాగునీటి వసతి పెరిగిన నేపథ్యంలో రైతులను ఈ దిశగా చైతన్యం చేయాలని సూచించారు. ప్రకృతి విపత్తులైన గాలివానలను, వాటి వలన జరిగే నష్టాలను మనం నివారించలేమన్నారు.

వైద్య సిబ్బంది కృషి అమోఘం

కరోనా నేపథ్యంలో వైద్య సిబ్బంది చేస్తున్న కృషి అమోఘమని మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అన్నారు. కరోనా లక్షణాలుంటే చికిత్స మొదలు పెట్టాలని, కరోనా నివారణకు అవసరమైన సదుపాయాల కల్పనకు, వచ్చే నెలలో అవసరమైన కిట్ల వివరాలు సమర్పించడనీ సంబంధిత జిల్లా అధికారులను ఆదేశించారు. వేసవి నేపథ్యంలో ఎండవేడిమి కేసులు కూడా వస్తాయనీ ఇలాంటి విషయాలలో కూడా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఇంటింటి జ్వర సర్వేలు ఖచ్చితంగా జరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు. జ్వర సర్వేల విషయంలో ప్రజలు, జ్వర పీడితుల నుండి ఎలాంటి స్పందన ఉంది వారు ప్రభుత్వం నుండి ఎలాంటి సేవలు ఆశిస్తున్నారు. ఇంకా ఏం చేయాలని సూచిస్తున్నారు. అయినవారే దూరం పెడుతున్న పరిస్థితులలో కరోనా విపత్తులో వైద్య సిబ్బంది, ఆశా వర్కర్ల సేవలకు చేతులెత్తిమొక్కాలని వారి సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు జైపాల్‌యాదవ్, ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, మర్రి జనార్ధన్‌రెడ్డి, బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి, బీరం హర్షవర్ధన్‌రెడ్డి, వీఎం అబ్రహం, పౌర సరఫరాల సంస్థ చైర్మన్ మారెడ్డి శ్రీనివాస్‌రెడ్డి, కలెక్టర్లు శృతిఓజా, వెంకట్రావు, శర్మన్, డీఎం హెచ్‌ఓలు శ్రీనివాసులు, చందునాయక్, సుధాకర్‌లాల్ పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News