Monday, April 29, 2024

బిఆర్‌ఎస్ పథకాలపై ఇంటింటి ప్రచారం జరపాలి

- Advertisement -
- Advertisement -

సిరిసిల్ల: తెలంగాణ రాష్ట్రంలో బిఆర్‌ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అబివృధ్ది పథకాలు ప్రతిఇంటికి వెళ్లి ప్రచారం సాగించాలని సిరిసిల్ల మున్సిపల్ చైర్‌పర్సన్ జిందం కళచక్రపాణి అన్నారు. సోమవారం సిరిసిల్లలో 1వ,12వ,15వ వార్డుల బూత్ కమిటీ సభ్యులతో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు.

రాష్ట్రంలో 60 లక్షల మంది సభ్యులున్న ఏకైక పెద్ద పార్టీ బిఆర్‌ఎస్ అని ఆమె తెలిపారు. దేశంలో ఎవ్వరు ఆలోచించని పథకాలు అమలు చేస్తూ సిఎం కెసిఆర్ విప్లవాత్మకంగా ఆదర్శప్రాయమైన పథకాలు అమల్లోకి తెచ్చి రాష్ట్రాన్ని దేవానికే ఆదర్శంగా మార్చారన్నారు.రానున్న అసెంబ్లీ ఎన్నికల దృష్టా ప్రతి 100 మంది ఓటర్లకు ఒక బూత్ కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.

మళ్లీ సిరిసిల్ల శాసనసభ్యులుగా కెటిఆర్‌ను గెలిపించుకోవడానికి ప్రణాళికా బద్దంగా ప్రచారం నిర్వహించాలన్నారు. పురపాలక సంఘం పరిధిలోని 39 వార్డుల్లో ప్రతి రోజు మూడు వార్డుల బూత్ కమిటీలు ఏర్పాటు చేసి వారితో సమావేశాలు ఈనెల 22 వరకు నిర్వహిస్తామన్నారు. ప్రతి కార్యకర్త వారి అభిప్రాయాలను తెలియచేసే అవకాశాలు ఉంటాయన్నారు.

ఈ కార్యక్రమంలో బిఆర్‌ఎస్ రాష్ట్ర నాయకులు చీటి నర్సింగరావు, జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య, బిఆర్‌ఎస్ పట్టణ అధ్యక్షుడు జిందం చక్రపాణి, రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు గడ్డం నర్సయ్య, గ్రంధాలయ సంస్థ చైర్మన్ ఆకునూరి శంకరయ్య, మున్సిపల్ విసి మంచె శ్రీనివాస్, బిఆర్‌ఎస్ మహిళా అధ్యక్షురాలు బత్తుల వనజ, బొల్లి రామ్మోహన్, చేపూరి నాగరాజు, మురళి, తిరుపతి, ప్రబాకర్,అంజయ్య, శ్రీనివాస్ గౌడ్, వంకాయల కార్తీక్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News