Thursday, May 9, 2024

డోర్ బెల్ ఫ్రాంక్ కేసు… భారత సంతతి అనురాగ్ చంద్రకు జీవిత ఖైదు

- Advertisement -
- Advertisement -

న్యూయార్క్ : రాత్రి పూట తన ఇంటి డోర్‌బెల్ మోగించి ఆటపట్టించిన ముగ్గురు టీనేజ్ కుర్రాళ్ల మరణానికి కారణమైన కేసులో భారత సంతతి వ్యక్తి అనురాగ్ చంద్ర (45)కు జీవిత ఖైదు పడింది. పలు విభాగాల్లో హత్య అభియోగాలు నమోదైన ఈ కేసులో అనురాగ్ ను ఇప్పటికే దోషిగా తేల్చిన న్యాయస్థానం తాజాగా శిక్ష ఖరారు చేసింది. పెరోల్ అవకాశం కూడా లేదని తాజా తీర్పులో వెల్లడించింది. ఆరుగురు యువకులు ఓ మిత్రుడి ఇంట్లో నిద్రించడానికి వచ్చారు. ఆ సమయంలో వారిలో ఒక అబ్బాయి డోర్‌బెల్ మోగించి ఆటపట్టించడానికి ప్రయత్నించాడు.

పొరుగున ఉన్న అనురాగ్‌చంద్ర ఇంటి డోర్‌బెల్‌ను పలుమార్లు మోగించి కారులో పారిపోడానికి ప్రయత్నించారు. దీంతో అనురాగ్ చంద్ర కోపగించుకుని వారిని వాహనంలో వెంబడించాడు. ఆ సమయంలో వారి కారును వెనుకనుంచి వేగంగా అనురాగ్ చంద్ర ఢీకొట్టాడు. దీంతో వారి వాహనం చెట్టుకు ఢీకొని అందులోని ముగ్గురు కుర్రాళ్లు ప్రాణాలు కోల్పోయారు. 2020 జనవరి 19న కాలిఫోర్నియా రివర్‌సైడ్ కౌంటీలో ఈ సంఘటన చోటు చేసుకుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News