Tuesday, April 30, 2024

కరణ్ జోహార్‌కు ఎన్‌సిబి సమన్లు

- Advertisement -
- Advertisement -

Drugs case:NCB Notice to Karan Johar

 

డ్రగ్స్ పార్టీ వీడియోపై ఆరా?

న్యూఢిల్లీ : బాలీవుడ్ ప్రముఖ నిర్మాత, టీవీ షో ప్రముఖుడు కరణ్ జోహార్‌కు మాదకద్రవ్యాల నిరోధక సంస్థ (ఎన్‌సిబి) సమన్లు పంపించింది. ఎడతెగని బాలీవుడ్ డ్రగ్స్‌తో లింక్‌లకు సంంధించి, వాస్తవాల వెలికితీతకు ఎన్‌సిబి ఈ చర్య తీసుకుంది. నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం తరువాతి క్రమంలో బాలీవుడ్‌లో మాఫియా సంబంధాలపై ఆరాకు నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో రంగంలోకి దిగింది. కొంతకాలంగా ప్రచారంలో ఉన్న వీడియోలోని అంశాల ఆధారంగా ఇప్పుడు కరణ్‌కు సమన్లు పంపించారు. సిక్కు నేత మన్‌జిందర్ సింగ్ సిర్సా ఫిర్యాదుకు స్పందనగా ఎన్‌సిబి నోటీసు వెలువరించింది.

2019లో కరణ్ నివాసంలో జరిగిన విందు ఇందులో మాదకద్రవ్యాల సేవనం వంటి విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ పార్టీ వీడియో నిజమైనదా? లేదా అనేది నిర్థారించుకునేందుకు జరిపిన పరిశీలనల ఫోరెన్సిక్ రిపోర్టు ఇప్పుడు ఎన్‌సిబికి అందింది. వీడియో లో ఎటువంటి మార్పులు లేవని, ఒరిజినల్ అని రిపోర్టుతో స్ఫష్టం అయింది. గత ఏడాది జులైలో కరణ్ ఇంట్లో జరిగిన విందులో భారీ ఎత్తున మాదకద్రవ్యాలను తీసుకుంటూ సినీ ప్రముఖులు గడిపారని పేర్కొంటూ ఈ వీడియోలోని విశేషాల పేరిట సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. అయితే ఇటువంటిదేమీ జరగలేదని తరువాత జోహర్ ప్రకటన వెలువరించారు. తప్పుడు ప్రచారం అన్నారు. తాను డ్రగ్స్ తీసుకోను, వీటిని ప్రోత్సహించను అని తెలిపారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News