Tuesday, May 7, 2024

10 భాషల్లో మాట్లాడుతోన్న దుబాయ్ క్యాబ్ డ్రైవర్

- Advertisement -
- Advertisement -

Dubai cab driver can speak in 10 different languages

 

దుబాయ్ : కారు రయ్‌న నడిపించడమే కాదు ఈ దుబాయ్ క్యాబ్ డ్రైవర్ ఏకంగా 10 భాషలను అనర్గళంగా మాట్లాడగలడు. హుస్సేన్ సయిద్‌కు పలు ప్రపంచ భాషలతో పరిచమం ఉంది. దుబాయ్‌కు వచ్చే వివిధ దేశాలకు చెందిన వారితో వారివారి భాషలలోనే మాట్లాడుతూ పలువురిని ఆకట్టుకుంటున్నాడు. అరబ్బీ, మలయాళం, చైనీస్ మాండరిన్, రష్యన్, పార్శీ, ఇంగ్లీషు, హిందీ, ఉర్దూ, పస్తో వంటి పలు భాషలలో ఆయన తడబడకుండా మాట్లాడుతాడు. ఈ విధంగా క్యాబ్ వాలా బహుముఖభాషా వాలా అయ్యారు. 33 ఏండ్ల ఈ వ్యక్తి పెషావర్‌కు చెందిన వారు. మెడిసిన్ చదువుతున్నప్పుడే భార్యకు గుండె జబ్బు ఉందని నిర్థారణ కావడంతో ఆమె చికిత్స కోసంచదువు ఆపేసి దుబాయ్‌కు వచ్చి కారు డ్రైవర్ పనిలో కుదిరాడు.

చిన్ననాటి నుంచి తనకు డాక్టర్ కావాలనే కల ఉందని, అయితే డ్రైవర్‌నుఅయ్యాయని, ఈ వృత్తిలో ఎదురయ్యే భాషాపరమైన అడ్డంకులను అధిగమించే అందరితో సముచితమైన రీతిలో వ్యవహరించేందుకు తాను పలు భాషలు నేర్చుకున్నానని తెలిపారు. ఇందుకు ఆయన గుగూల్ తర్జుమా యాప్, పలు భాషల అభ్యాస యాప్‌లు ఎంతగానో తోడ్పడ్డాయి. ఎవరినైనా సరే వారివారి సొంత భాషలలో మనం పలకరిస్తే వారి కళ్లలో మెరుపు తళుక్కుమంటుంది. పరస్పర ఆదరణ పెరుగుతుందన్నారు. మానవీయ సంబంధాలకు భాషను మించిన అనుసంధాన ప్రక్రియ మరోటి లేదన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News