Monday, April 29, 2024

ఐదుసార్లు ఎంఎల్‌ఎగా దుద్దిళ్ల శ్రీదర్‌బాబు

- Advertisement -
- Advertisement -

మంథని నియోజకవర్గం నుంచి దుద్దిళ్ళ శ్రీధర్‌బాబు విజయం సాధించారు. మాజీ స్పీకర్ దుద్దిళ్ళ శ్రీపాద రావు, జయమ్మ దంపతులకు 1969 మే 30న జన్మించారు. ఐఎఎస్ అధికారి శైలజ రామయ్యర్‌తో వివాహం జరిగింది. మంథని నుంచి ఐదుసార్లు ఎంఎల్‌ఎగా గెలుపొందారు. ఉమ్మడి ఎపిలో పౌర సరఫరాలు, శాసన వ్యవహారాల మంత్రిగా పని చేశారు. ఢిల్లీ విశ్వవిద్యాలయంలో న్యాయ విద్యను అభ్యసించారు. 1998లో ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో న్యాయవాదిగా కూడా పేరు నమోదు చేసుకున్నారు. తండ్రి శ్రీపాదరావు హత్యతో 1999లో రాజకీయాల్లో వచ్చారు శ్రీధర్‌బాబు. 1999 శాసనసభ ఎన్నికల్లో మంథని నుంచి మొదటి సారిగా గెలుపొందారు.

2004, 2009, 2018, 2023 మంథని నుంచి విజయం సాధించారు. 2004-2019 వరకు ప్రభుత్వ చీఫ్ విప్ కూాడ ఉన్నారు. 2010-2014 వరకు కిరణ్‌కుమార్ రెడ్డి కేబినెట్‌లో శాసనసభ వ్యవహారాల మంత్రిగా, 2009-10 వరకు ఉన్నత విద్య, ఎన్‌ఆర్‌ఐ వ్యవహారాల మంత్రిగా విధులు నిర్వహించారు. 2014లో మేనిఫెస్టో కమిటీ ఛైర్మన్‌గా ఉన్నారు. ప్రస్తుతం తెలంగాణ కాంగ్రెస్ కమిటీ ఉపాధ్యక్షుడుగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News