Monday, April 29, 2024

మహిళా సాధికారతకు కృషి : సత్యవతి రాథోడ్

- Advertisement -
- Advertisement -

Efforts for Women's Empowerment: Satyavathi Rathod

 

మనతెలంగాణ/ హైదరాబాద్ : మహిళా సాధికారత, సమగ్ర అభివృద్ధికి మహిళా నేతలంతా కలిసికట్టుగా ముందుకెళ్తామని రాష్ట్ర గిరిజన, స్త్రీ -శిశు సంక్షేమ శాఖల మంత్రి సత్యవతిరాథోడ్ అన్నారు. శుక్రవారం రాష్ట్ర మహిళా సహకార అభివృద్ధి సంస్థ చైర్‌పర్సన్‌గా ఆకుల లలిత ప్రమాణ స్వీకారోత్సవానికి మంత్రి హాజరై శుభాకాంక్షలు తెలిపారు. అదే విధంగా రాష్ట్ర ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్, ఎమ్మెల్సీలు కల్వకుంట్ల కవిత, కూచుకుల్ల దామోదర్‌రెడ్డి, గంగాధర్‌గౌడ్,శేరి సుభాష్‌రెడ్డి,ఎంఎస్ ప్రభాకర్‌రావు,ఎమ్మెల్యేలు జీవన్ రెడ్డి, బాజీరెడ్డి గోవర్ధస్, బిగాల గణేష్‌గుప్తా, గంప గోవర్ధన్,మహిళా శిశు సంక్షేమ శాఖ కమిషనర్, ప్రత్యేక కార్యదర్శి దివ్యదేవరాజన్, జాయింట్ డైరెక్టర్ సబిత, వివిధ జిల్లాలకు చెందిన ప్రజాప్రతినిధులు లలితకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గ్రామీణ , పట్టణ ప్రాంతాల్లో మహిళలకు ఉండే సమస్యలు పరిష్కరించేందుకు తనతో పాటు చైర్‌పర్సన్లు ఆకుల లలిత, సునీతాలక్ష్మారెడ్డిలకు అత్యున్నత పదవులు ఇవ్వడం.. మహిళల పట్ల సిఎం కెసిఆర్‌కి ఉన్న నమ్మకం, ప్రేమకు నిదర్శనమన్నారు. మహిళలకు ఆర్థిక చేయూతను ఇచ్చేలా సంస్థ కృషి చేస్తుందన్నారు.

31 జిల్లాలకు కార్పొరేషన్‌ను విస్తరిస్తాం : ఆకుల లలిత

మహిళా సహకార అభివృద్ధి సంస్థ ప్రస్తుతం ఉమ్మడి పది జిల్లాల్లో పని చేస్తోంది.. సిఎం కెసిఆర్ మార్గదర్శనంలో 31 జిల్లాలకు విస్తరిస్తామని సంస్థ చైర్‌పర్సన్ ఆకుల లలిత అన్నారు. ప్రమాణ స్వీకారం అనంతరం ఆమె మాట్లాడుతూ మహిళా సాధికారత, వారి ఆర్థిక అభ్యున్నతికి సంస్థ చొరవ చూపుతుందన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News