Monday, April 29, 2024

హరితహారం లక్ష్యం సాధించేలా కృషి చేయాలి

- Advertisement -
- Advertisement -

నల్గొండ : నల్లగొండ జిల్లాలో 100 శాతం 9వ విడత హరితహారం లక్ష్యం సాధించేలా కృషి చేయాలని జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి అధికారులను కోరారు. శుక్రవారం నాడు కలెక్టరేట్ నుండి ఎంపీడీవోలు, ఎంపీఓలు, ఏపీవోలతో జిల్లా కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మా ట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యo మేరకు హరితహారం కార్యక్రమంలో అధికార యంత్రాంగం పూర్తిగా భాగస్వామ్యం కావాలని ఆయన తెలిపారు.

జిల్లాలోని అన్ని మండలాలు, గ్రామాలు, అదేవిధంగా మున్సిపాలిటీలు, అటవీ శాఖ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున మొక్కలు నాటాలని ఆయన తెలిపారు. 9వ విడత హరితహారంలో భాగంగా 65 లక్షల మొక్కలు లక్ష్య ంగా వివిధ ప్రభుత్వ శాఖలకు లక్ష్యంగా కేటాయింపు చేశారు అన్నారు. అందులో ముఖ్యంగా అటవీ శాఖ, ఉద్యాన శాఖ, వ్యవసాయ శాఖ, గ్రామీణ అభివృద్ధి శాఖ, ఎక్సైజ్, విద్యా శాఖ,మున్సిపాలిటీ, వివిధ శాఖల వారిగా పూర్తి వివరాలు, అదేవిధంగా మండలాల వారిగా లక్ష్యాలను ఎప్పటికప్పుడు స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ కు నివేదికలు పంపించాలని ఆయన ఆదేశించారు.

గ్రామపంచాయతీల వా రిగా మండల స్థాయి అధికారులు లక్ష్యానికి అనుగుణంగా మొక్కలు నాటడానికి తగిన చర్యలు తీసుకోవాలన్నారు. అందులో భాగంగా అటవీ శాఖ వ్యవసాయ శాఖ విద్యాశాఖ అధికారులను భాగస్వామ్యం చేయాలన్నారు. మున్సిపాలిటీలలో మున్సిపల్ కమిషనర్లు ప్రత్యేక చొరవ తీసుకొని మొక్కలు నాటాలని ఆయన తెలిపారు. హరితహారం కార్యక్రమం లో భాగంగా ఇంటింటికి మొక్కలు పంపిణీ చేసి నాటేందుకు ఔత్సాహికలను ప్రోత్సహించాలన్నారు. హరితహారం కార్యక్రమం లో స్థానిక ప్రజా ప్రతినిధులను భాగస్వామ్యం చేయాలన్నారు. కార్యక్రమ వివరాలను అధికారులు ఎప్పటికప్పుడు ప్రజాప్రతినిధులకు తెలియజేయాలన్నారు.ఈ వీడియో కాన్ఫరెన్స్ల స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ కుష్బూ గుప్తా,డి.ఎఫ్. ఓ రాం బాబు, జిల్లా పరిషత్ సీఈఓ ప్రేమ్ కరణ్ రెడ్డి, జిల్లా పంచాయతీ అధికారి విష్ణువర్ధన్ రెడ్డి, డిఆర్డిఓ కాళిందిని, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News