Saturday, April 27, 2024

ఎన్నికల కిక్కు

- Advertisement -
- Advertisement -

11 శాతం పెరిగిన మద్యం అమ్మకాలు

ఈనెలలో 20వ తేదీ వరకు రూ.210 కోట్ల మద్యం అమ్మకాలు అధికం

రోజుకు రూ.75 కోట్ల నుంచి రూ.90 కోట్ల విక్రయాలు

ఇతర రాష్ట్రాల నుంచి మద్యాన్ని లిప్ట్ చేయించిన అభ్యర్థులు!

ఇసి ఆదేశాలతో నిఘా ఇప్పటివరకు రూ.105 కోట్ల అక్రమ మద్యం పట్టివేత

మనతెలంగాణ/హైదరాబాద్:  అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో మద్యం అమ్మకాలు ఊపందుకున్నాయి. ఈ 20 రోజుల్లో సుమారుగా 11 శాతం మద్యం విక్రయాలు పెరిగినట్టుగా ఎక్సైజ్ వర్గాలు పేర్కొన్నాయి. వాస్తవానికి 30 నుంచి 40 శాతం అధికంగా విక్రయాలు ఉండవచ్చని ఎక్సైజ్ శాఖ అధికారులు భావించినా అభ్యర్థులు ఎన్నికల కోడ్ రాకముందే వేరే రాష్ట్రాల నుంచి తెలంగాణకు మద్యాన్ని లిప్ట్ చే యించుకున్నట్టుగా ఎక్సైజ్ అధికారులు భావిస్తున్నా రు. ఇప్పటివరకు ఎక్సైజ్ శాఖ అధికారులు ఆశించిన రీతిలో తెలంగాణలో మద్యం విక్రయాలు జరగకపోవడంతో దీనిపై అధికారులు ఆరా తీస్తున్నారు. గతేడాది కన్నా ఈ ఏడాది నవంబర్‌లో సుమారుగా రూ.200 కోట్ల పైచిలుకు మద్యం అధికంగా అమ్ముడు పోయినట్టుగా అధికారిక లెక్కలు చెబుతున్నాయి.
28 నుంచి 30 వరకు మద్యం షాపుల బంద్
ఈనెల 30వ తేదీ నాటికి ప్రస్తుతం ఉన్న మద్యం షాపులకు చివరితేదీ కాగా, డిసెంబర్ 01వ తేదీ నుంచి కొ త్త మద్యం షాపులు అందుబాటులోకి రానున్నాయి. దీంతోపాటు ఈనెల 28వ తేదీ నుంచి 30వ తేదీ వర కు 3రోజుల పాటు ఎన్నికల నేపథ్యంలో మద్యం షా పులు మూసివేయాలని ఉత్తర్వులు జారీ కావడంతో ముందస్తుగానే అభ్యర్థులు మద్యాన్ని లిప్ట్ చే యించుకున్నట్టుగా ఎక్సైజ్ అధికారులు భావిస్తున్నారు.
రూ.22 లక్షల కార్టన్‌ల బీర్ల అమ్మకాలు
గత సంవత్సరం నవంబర్ 1వ తేదీ నుంచి 20వ తేదీ మధ్యలో రాష్ట్రం మొత్తం మీద రూ.1,260 కోట్ల విలు వ చేసే మద్యం విక్రయాలు జరగ్గా ఈ ఏడాది రూ. 1,470 మద్యం మాత్రమే అమ్ముడయ్యిందని అధికారులు తెలిపారు. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది నవంబర్‌లో 20 రోజులకు గాను రూ.210 కోట్ల మేర మ ద్యం అదనంగా అమ్ముడయ్యిందని ఎక్సైజ్ అధికారు లు పేర్కొంటున్నారు. అయితే ఇందులో బీర్ల అమ్మకా లు కొంతమేర పెరిగినట్టు ఎక్సైజ్ శాఖ లెక్కలు చెబుతున్నాయి. గతేడాది నవంబర్ 1 నుంచి 20వ తేదీ మ ధ్య దాదాపు రూ. 12.5 లక్షల కార్టన్ల బీర్లు అమ్ముడుపోగా ఈసారి రూ.22 లక్షల కాటన్‌ల బీర్లు అమ్ముడుపోవడం విశేషం.
40 రోజుల్లో రూ.380 కోట్ల మద్యం విక్రయం
ఈ క్రమంలో 40 రోజుల్లో కేవలం రూ.380 కోట్ల రూ పాయల విలువైన మద్యం మాత్రమే అదనంగా అ మ్ముడు పోయినట్లు ఎక్సైజ్ శాఖ పేర్కొంటుంది. సా ధారణంగానే ప్రతి ఏడాది లిక్కర్ సేల్స్ 10 నుంచి 15 శాతం వరకు పెరుగుదల ఉంటుంది. ఇప్పుడు పెరిగి న రూ.380 కోట్లు ద్వారా కేవలం 11 శాతం మాత్ర మే అమ్మకాలు జరిగినట్టు ఎక్సైజ్ శాఖ పేర్కొంటుం ది. తద్వారా సాధారణంగా పెరగాల్సిన విక్రయాలు పెరగలేదని ఉన్నతాధికారులు పేర్కొంటున్నారు. గడిచిన వారం రోజులుగా జరిగిన మద్యం అమ్మకాల ను పరిశీలించినట్లయితే ఈ నెల 13, 16 రెండు రో జులు మాత్రమే రూ.100 కోట్లుకుపైగా లిక్కర్ అమ్మకాలు జరిగినట్లుగా అధికారులు పేర్కొంటున్నారు. మిగిలిన రోజుల్లో రోజుకు రూ.75 కోట్ల నుంచి రూ. 90 కోట్ల వరకు మాత్రమే విక్రయాలు జరిగాయని అధికారుల గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. 2022 అక్టోబర్ 9వ తేదీ నుంచి నవంబర్ 18వ తేదీ వరకు రూ.3,470 కోట్ల విలువైన మద్యంతో పాటు 37.76 లక్షల లిక్కర్ కేసులు, 40.85 లక్షల కేసుల బీర్ల అమ్మకాలు జరిగినట్లు అబ్కారీ శాఖ అధికారిక లెక్కలు స్పష్టం చేస్తున్నాయి.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News