Thursday, May 9, 2024

ఆగస్టు 1నుంచి ఇంజనీరింగ్ తరగతులు..

- Advertisement -
- Advertisement -

Engineering Classes 2022-23 begin from August 1st

మనతెలంగాణ/హైదరాబాద్: దేశవ్యాప్తంగా ఇంజనీరింగ్, ఫార్మసీ తదితర సాంకేతిక విద్యా కళాశాలల్లో మొదటి సంవత్సరం తరగతులు ఆగస్టు 1వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు అఖిల భారత సాంకేతిక విద్యా మండలి (ఎఐసిటిఇ) అకడమిక్ క్యాలెండర్‌ను ప్రకటించింది. మే నెలలో ఎఐఇఇ, రాష్ట్రాల ప్రవేశ పరీక్షలు నిర్వహించి, జూన్ 5లోగా ఫలితాలు ప్రకటించాలని తెలిపింది. దేశవ్యాప్తంగా సాంకేతిక విద్యా కోర్సులకు సంబంధించి మొదటి విడత కౌన్సెలింగ్ ప్రక్రియ జూన్ 30వ తేదీలోగా పూర్తి చేసి సీట్లు కేటాయించాలని ఎఐసిటిఇ తెలిపింది. జూలై 10 నాటికి రెండవ విడత సీట్లు, జూలై 20 నాటికి మూడత విడత సీట్లు కేటాయించాలని పేర్కొంది. ఆగస్టు 15 నాటికి కళాశాలల్లో ప్రవేశాలు పొందిన విద్యార్థుల వివరాలు, ఖాళీ సీట్ల వివరాలు పొందుపరచాలని తెలిపింది.

ఎఐసిటిఇ ప్రకటించిన అకడమిక్ క్యాలెండర్

కేటగిరీ                                  షెడ్యూల్
ఎఐసిటిఇ అప్రూవల్                    ఏప్రిల్ 10
యూనివర్సిటీ అఫిలియేషన్            మే 15
మొదటి దశ కౌన్సెలింగ్, ప్రవేశాలు     జూన్ 30
రెండవ దశ కౌన్సెలింగ్, ప్రవేశాలు      జూలై 10
తరగతులు ప్రారంభం                   ఆగస్టు 1

Engineering Classes 2022-23 begin from August 1st

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News