Saturday, April 27, 2024

జూన్ 6న గురుకుల జూనియర్ కాలేజీ ప్రవేశ పరీక్ష

- Advertisement -
- Advertisement -

Entrance Test for Jr Gurukul Colleges on Jun 6th

మన తెలంగాణ/హైదరాబాద్: తెలంగాణ గురుకుల జూనియర్ కళాశాలల్లో 2022-23 విద్యా సంవత్సరానికి ఇంటర్ మొదటి సంవత్సరంలో ప్రవేశాలకు జూన్ 6న ప్రవేశ పరీక్ష నిర్వహిస్తున్నట్లు తెలంగాణ గురుకుల విద్యాలయాల సంస్థ కార్యదర్శి సిహెచ్ రమణకుమార్ తెలిపారు. హైదరాబాద్, మహబూబ్‌నగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం, నల్గొండ, రంగారెడ్డి, మెదక్, సిద్దిపేట, సంగారెడ్డి జిల్లా కేంద్రాల్లో ఈ నెల 6న ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 12.30 గంటల వరకు ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నట్లు తెలిపారు. ఇదివరకే దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు ఆన్‌లైన్ (http://tsrjdc.cgg.gov.in) వెబ్‌సైట్ నుండి హాల్ టికెట్ డౌన్‌లోడ్ చేసుకోవాలని సూచించారు. హాల్ టికెట్ నందు ఏవైనా తప్పులు ఉంటేఉ వారికి కేటాయించబడిన పరీక్ష కేంద్రంలో సంబంధిత దృవీకరణ పత్రములతో సరిచేసుకోవాలని సూచించారు.

Entrance Test for Jr Gurukul Colleges on Jun 6th

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News