Monday, April 29, 2024

పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత

- Advertisement -
- Advertisement -

వనపర్తి : పర్యావరణాన్ని పరిరక్షించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని జిల్లా పరిషత్ చైర్మన్ ఆర్. లోక్‌నాథ్ రెడ్డి సూచించారు. దశాబ్ది ఉత్సవాలలో భాగంగా జిల్లా అటవి శాఖ ఆధ్వర్యంలో సోమవారం మెడికల్ క ళాశాల పరిధిలో ఏర్పాటు చేసిన హరితోత్సవం కార్యక్రమానికి జిల్లా కలెక్టర్‌తో కలిసి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

తెలంగాణ దశాబ్ది ఉత్సవ ప్రకృతి వనాన్ని ప్రారంభించి మొక్కలు నాటినట్లు తెలిపారు. ఈ సందర్భంగా జెడ్పి చైర్మెన్ మాట్లాడుతూ మొక్కలు పెంచడం ద్వారా స్వచ్ఛమైన గాలి అందుతుందని, ప్రజలు కాలు ష్యం బారిన పడకుండా నివారిం చవచ్చన్నారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ 9వ విడత హరితహారం కార్యక్రమాన్ని ప్రారంభించి మాట్లాడుతూ వనపర్తి జిల్లాలో అటవి విస్తీర్ణం 7 నుంచి 8 శాతం అభివృద్ధి చెందినట్లు ఆయన తెలిపారు.

9వ విడత హరితహారం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని అ ధికారులకు, ప్రజా ప్రతిని ధులకు ఆయన పిలుపునిచ్చారు. జిల్లా అదనపు ఎస్పి షాకీర్ హుస్సేన్, మున్సిపల్ చైర్మెన్ గట్టు యాదవ్, వైస్ చైర్మన్ వాకిటి శ్రీధర్, డిఎఫ్‌ఓ నవీన్ రెడ్డి, డిఎస్‌పి ఆనంద రెడ్డి, జి ల్లా అధికారులు, మున్సిపల్ కమిషనర్ విక్రమ్ సింహారెడ్డి, ప్రజా ప్రతినిధులు, సిబ్బంది పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News