Saturday, April 27, 2024

పెరిగిన ఉద్యోగాలు

- Advertisement -
- Advertisement -

డిసెంబర్‌లో ఇపిఎఫ్‌ఒలో చేరిన 15.62 లక్షల మంది సభ్యులు,  కొత్త సభ్యుల సంఖ్య 8.41 లక్షల మంది

న్యూఢిల్లీ : దేశంలో నిరుద్యోగం పెరుగుతోందనే ఆందోళనల వేళ ఇప్పుడు శుభవార్త వినిపించింది. దేశంలో ఉద్యోగాల సంఖ్య వేగంగా పెరుగుతోంది. ఉద్యోగ భవిష్యనిధి సంస్థ (ఇపిఎఫ్‌ఒ) మంగళవారం విడుదల చేసిన గణాంకాలు ఈ విషయాన్ని చెబుతున్నాయి. డేటా ప్రకారం, డిసెంబర్ 2023లో 15.62 లక్షల మంది సభ్యులు ఇపిఎఫ్‌ఒలో చేరగా, గత మూడు నెలల్లో ఇదే అత్యధికం కావడం గమనార్హం. దీంతో దేశంలో ఉద్యోగాలు పెరుగుతున్నాయని స్పష్టమవుతోంది. 2022 డిసెంబర్‌తో పోలిస్తే ఈ సంఖ్య 4.62 శాతం పెరిగింది.

కార్మిక మంత్రిత్వ శాఖ ప్రకారం, 2023 డిసెంబర్‌లో 8.41 లక్షల మంది కొత్త సభ్యులు ఇపిఎఫ్‌ఒలో చేరారు. 2023 నవంబర్‌తో పోలిస్తే ఈ సంఖ్య 11.97 శాతం పెరిగింది. ఇపిఎఫ్‌ఒ పేరోల్ డేటా ప్రకారం, ఈ కాలంలో మొత్తం కొత్త సభ్యులలో 18 నుండి 25 వయస్సు గల వారి వాటా 57.18 శాతం గా ఉంది. దేశంలోని సంఘటిత రంగంలో ఎక్కువ మంది యువతే ఉన్నారు. యువతకు ఉద్యోగాలు కల్పించడంలో కంపెనీలు ముం దున్నాయి. డేటా ప్రకారం, డిసెంబర్ 2023 లో ఇపిఎఫ్‌ఒ స్కీమ్‌ల నుండి బయటకు వెళ్లిన దాదాపు 12.02 లక్షల మంది సభ్యులు తిరిగి వచ్చారు. ఉద్యోగం మానేసిన తర్వాత వేరే చోట ఉద్యోగంలో చేరడం వల్ల ఇలా జరుగుతుంది.

గణాంకాల ప్రకారం, ప్రతి నెల కొత్త సభ్యుల సంఖ్య వేగంగా పెరుగుతోంది. వారి లో చాలా మందికి మొదటిసారి ఉద్యోగం వచ్చింది. కొత్తగా చేరిన 8.41 లక్షల మంది లో దాదాపు 2.09 లక్షల మంది మహిళలు ఉన్నారు. డిసెంబర్ 2023లో మొత్తం 2.90 లక్షల మంది మహిళలు ఇపిఎఫ్‌ఒలో సభ్యు లు అయ్యారు. నవంబర్ 2023తో పోలిస్తే 3.54 శాతం పెరిగింది. మహారాష్ట్ర, గుజరాత్, తమిళనాడు, కర్ణాటక, హర్యానా నుండి గరిష్టంగా 58.33 శాతం సభ్యులు ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News