Monday, April 29, 2024

రూ.1350 కోట్ల పెట్టుబడి

- Advertisement -
- Advertisement -

ముందుకొచ్చిన ఈస్టర్ కంపెనీ
తెలంగాణకు కొనసాగుతున్న పెట్టుబడుల వరద

 ప్యాకేజింగ్ ఫిల్మ్ మాన్యుఫ్యాక్చరింగ్ ప్లాంట్ నెలకొల్పేందుకు ముందుకు వచ్చిన ఈస్టర్ ఫిల్మిటెక్ లిమిటెడ్ సంస్థ
ఆ కంపెనీ చైర్మన్ అరవింద్ సింఘానియాతో నిర్వహించిన వర్చువల్ సమావేశంలో వెల్లడించిన మంత్రి కెటిఆర్

మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రానికి కంపెనీలు వెల్లువ కొనసాగుతోంది. నూతనంగా మరో కంపెనీ తమ ఉత్పత్తి కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చింది. ఈస్టర్ ఫిల్మ్‌టెక్ లిమిటెడ్ సంస్థ రాష్ట్రంలో ప్యాకేజింగ్ ప్లాంట్‌ను ఏర్పాటు చేయనుంది. ఇందుకుగానూ రూ.1350 కోట్లను వెచ్చించనుంది. ఈ విషయాన్ని రాష్ట్ర ఐటి, పరిశ్రమలు, పురపాలక శాఖ మంత్రి కెటిఆర్ వెల్లడించారు. ఆ కంపెనీ సంస్థ చైర్మన్ అరవింద్ సింఘానియాతో మంత్రి కెటిఆర్ సోమవారం మర్చువల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఈస్టర్ కంపెనీ రాక పట్ల మంత్రి కెటిఆర్ సంతోషం వ్యక్తం చేశారు.

రాష్ట్రంలో ఈస్టర్ కంపెంనీ అడ్వాన్స్‌డ్ పాలిస్టర్ ఫిల్మ్ ఉత్పత్తి కేంద్రాన్ని త్వరలో ప్రారంభిస్తుందని ఆయన తెలిపారు. తొలి దశలో కంపెనీ నిర్మాణం కోసం రూ.500 కోట్ల ఖర్చు చేయనుందని పేర్కొన్నారు. 2022లో మూడవ క్వార్టర్‌లో తొలి దశ పూర్తి కానుందన్నారు. ఈ కంపెనీ ద్వారా స్థానికంగా 800 మందికి ఉద్యోగావకాశాలు దక్కునున్నాయని తెలిపారు. ప్యాకేజింగ్ పరిశ్రమకు చెందిన పాలిమర్ ఉత్పత్తులను ఇక్కడ తయారు చేస్తారని మంత్రి కెటిఆర్ వివరించారు. 30 నుంచి 40 శాతం వరకు ఉత్పత్తులను ఎగుమతి చేయనున్నట్లు వెల్లడించారు. అనంతరం కంపెనీ చైర్మన్ అరవింద్ సింఘానియా మాట్లాడుతూ, తమ కంపెనీ నిర్మాణంతో ప్యాకేజింగ్ పరిశ్రమలో తెలంగాణకు ప్రత్యేక స్థానం వస్తుందని విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఉన్న ఇండస్ట్రీ ఫ్రెండ్లీ విధానాల వల్లే తెలంగామలో కంపెనీ ఏర్పాటు చేసేందుకు ఆసక్తి చూపిస్తాన్నామన్నారు. వృద్ధి లక్ష విధానాలు, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లోనూ రాష్ట్రం దూసకపోతున్నదని వ్యాఖ్యానించారు. పాలిస్టర్ ఫిల్మ్ ఉత్పత్తుల్లో.. ..దేశంలోనే ఈస్టర్ పరిశ్రమ అగ్రస్థానంలో ఉందని పేర్కొన్నారు. తమ పాలిమర్ ఉత్పత్తులను సుమారు 56 దేశాలకు ఎగుమచి చేస్తోందని ఆయన తెలిపారు.

ఆదాట్రిప్ యాప్‌ను ఆవిష్కరించిన మంత్రి కెటిఆర్
సరుకు రవాణా రంగంలో వినూత్న ఆదాట్రిప్ యాప్‌ను మంత్రి కెటిఆర్ ఆవిష్కరించారు. సర్వేజనా ఐటి సొల్యూషన్స్ సంస ఈ యాప్‌ను పొందించింది. అనంతరం మంత్రి కెటిఆర్ మాట్లాడుతూ, ఇంధనంతో పాటు డబ్బు, సమయం వృధాను అరికడుతూ సరుకు రవాణాను ఒక ప్రణాళిక బద్దంగా ముందుకు తీసుకెళ్లేందుకు ఈ యాప్ ఎంతగానే ఉపయోగపడుతుందన్నారు. ప్రతి వాహనం గమ్యస్థానికి చేరడం, తిరిగి వెనక్కిరావజడం, సరుకు రవాణాను చౌకగా అందుబాటులోకి తీసుకురావడానికి సర్వేజనా ఐటీ సొల్యూషన్స్ వారి ఆదాట్రిప్ యాప్ ఎంతో ప్రయోజనకారిగా ఉంటుందన్నారు.

హస్త కళల మార్కెటింగ్ కోసం ట్రై క్రాఫ్ట్ మొబైల్ అప్లికేషన్
సృజనాత్మకత ఉట్టిపట్టే కళాకృతులను తయారు చేసే హస్తకళను నమ్ముకొని చాలా మంది కళాకారులు తమ జీవనాన్ని కొనసాగిస్తున్నారు. ప్రతి వస్తువు తయారికి యంత్రాల వాడకం ఎక్కువైన ప్రస్తుత పారిశ్రామిక పరిస్థితులలో హస్తకళలు, కళాకారులు మరుగున పడే అవకాశం లేకపోలేదు. ఈ నేపథ్యంలో జగిత్యాలకు చెందిన రమా శ్రీనివాస్ హస్త కళాకారులను ప్రోత్సహించడానికి…హస్త కళాకృతులను దేశ విదేశాల్లో మార్కెటింగ్ చేయడానికి ట్రై క్రాఫ్ట్ మొబైల్ అప్లికేషన్ ను తయారు చేశారు. దీనిని రాష్ట్ర ఐటి శాఖ మంత్రి కెటిఆర్ ఆవిష్కరించారు. అనంతరం ఈ యాప్‌ను ప్రయోజనాలను ఉద్ధేశించి రమా శ్రీనివాస్ మాట్లాడుతూ, హస్త కళను నమ్ముకున్న వారి కలలను నిజం చేయడానికి దీనిని రూపొందించినట్లు తెలిపారు. హస్త కళాకృతులు నేరుగా తయారీదారు నుండి హస్తకళా పోషకుల వరకు చేరడానికి ఒక వేదికగా ఈ క్రాఫ్ట్ మొబైల్ అప్లికేషన్ ఎంతో దోహదపడుతుందన్నారు. తన చిన్నతనం నుంచే ఈ రంగంలో ఏదైనా మంచి మార్పు తీసుకురావడానికి ప్రయత్నిస్తూ వస్తున్నానని పేర్కొన్నారు. ఈ యాప్‌తో తన ప్రయత్నం ఫలించినందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ అప్లికేషన్‌ను ఆవిష్కరించిన మంత్రి కెటిఆర్‌కు తన హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు రమా శ్రీనివాస్ తెలిపారు.

Ester Filmtec Ltd firm Invest rs 1350 cr in Hyd

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News