Monday, April 29, 2024

ఆర్థిక ఇబ్బందులతో కుటుంబం అదృశ్యం

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ఆర్థిక ఇబ్బందులు తట్టుకోలేక ఓ కుటుంబం అదృశ్యమైన సంఘటన మలక్‌పేట పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. కుటుంబాకి చెందిన కుమార్తె ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. పోలీసుల కథనం ప్రకారం…మలక్‌పేట, సలీంనగర్‌కు చెందిన వరాహమూర్తి, దుర్గ దంపతులకు ముగ్గురు కుమార్తెలు, కుమారుడు ఉన్నాడు. ముగ్గురు కుమార్తెలకు వివాహం చేసిన వరాహమూర్తి కుమారుడు సత్య భైరవతో కలిసి మహమ్మద్ ఖాన్ జ్యూవెలరీ షాప్‌లో పనిచేస్తున్నారు. కుటుంబ అవసరాలు, కుమార్తెల వివాహం కోసం వరాహమూర్తి సుమారు రూ.50లక్షల వరకు అప్పులు చేశాడు. వాటిని తీర్చే దారి కన్పించకపోవడంతో గత కొంత కాలం నుంచి తండ్రి,

కుమారుడు నిస్సహాయస్థితిలో ఉన్నారు. చేసిన అప్పులకు వడ్డీలు కడుతూ జీవనం సాగిస్తున్నారు. వడ్డీలు పెద్ద మొత్తంలో ఉండడంతో అవి కట్టి కట్టి మరీ అప్పుల్లోకి కుటుంబం కూరుకుపోయింది. అప్పులు తీర్చే దారికన్పించకపోవడంతో కుటుంబసభ్యులు చావుకు సిద్ధమయ్యారు. ‘మాకు చావు తప్ప వేరే మార్గం లేదు క్షమించండి, మా చావుకు ఎవరు బాద్యులు కారు అంటూ‘ ఓ లెటర్ రాసి అదృశ్యం అయ్యారు. ఇంట్లో ఈ నెల 20వ తేదీ రోజు ఓ పేపర్ పైన రాసి సెల్ ఫోన్లు ఇంట్లో వదిలేసి ఇంటికి తాళం వేసి కుటుంబసభ్యులు వెళ్లిపోయారు. ఈ విషయం తెలుసుకున్న కూతురు చాముండేశ్వరి మలక్ పేట పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News