Monday, April 29, 2024

రూ. 9 లక్షలకు ముగ్గురు పిల్లల విక్రయం

- Advertisement -
- Advertisement -

మహబూబ్ నగర్ : ఆయనో కన్న తండ్రి… కుటుంబానికి ఆసరాగా ఉండాల్సిన పెద్దమనిషి. కన్న పిల్లలకు భరోసా ఇవ్వాల్సిన తండ్రి. ఏ ఆపద వచ్చిన నేనున్నానంటూ కుటుంబానికి ధైర్యం చెప్పాల్సిన తండ్రి కానీ ఆ తండ్రి దారి తప్పాడు. తాగుడుకు బానిసై కుటుంబం సైతం వదిలి ఎంజాయ్ చేశాడు. చివరికి డబ్బులు అయిపోవడంతో ఏకంగా పసిపిల్లలనే అమ్మాలని చూశాడు ఆ కర్కశ తండ్రి. విషయం తెలుసుకున్న కన్న తల్లి పోలీసులను ఆశ్రయించింది. పోలీసులు వేగంగా స్పందించి పసిపిల్లలను కొనుక్కున్న వ్యక్తి చర నుండి విడిపించి తల్లికి అప్పగించారు. దీంతో తండ్రికి స్థానికులు దేహశుద్ధి చేశారు. ఈ సంఘటన మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్లలో చోటు చేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. భూత్పూర్ మండలం తాడిపత్రి గ్రామానికి చెందిన రఫిక్ జడ్చర్ల పట్టణంలోని నిమ్మగడ్డ బావికి చెందిన అభివృద్ది వీరికి ముగ్గురు పిల్లలు ఉన్నారు. వీరిలో ఒకరు ఆడపల్లి కాగా మరో ఇద్దరు మగ పిల్లలు.

వీరందరూ కలిసి జడ్చర్ల పట్టణంలోని గౌరీ శంకర్ కాలనీలో అద్దె ఇంట్లో నివాసం ఉంటున్నారు. గత కొద్ది సంవత్సరాల క్రితం చెడు అలవాట్లకు గురైన రఫిక్ గోవాకి వెళ్లాడు. అక్కడ చెడు వ్యసనాలకు బానిసై మరో వివాహం చేసుకున్నారు. దీంతో తరచూ గొడవలు పడుతున్న రఫిక్ ఆదివారం జడ్చర్ల పట్టణానికి చేరుకున్నాడు. తల్లి లేకపోవడంతో చిన్నారు లైన రుబేనా బేగం, రమీజ్, సోయబ్‌లను హైదరాబాద్‌కు ద్విచక్ర వాహనంపై తీసుకెళ్లాడు. సాయంత్రం వరకు పిల్లలు తిరిగి ఇంటికి రాకపోవడంతో అనుమానం వ్యక్తం చేసిన తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు రంగ ప్రవేశం చేసి కుటుంబ సభ్యులు ఇచ్చిన సమాచారం మేరకు హైదరాబాద్‌కు వెళ్లారు. అక్కడ బంధువుల ఇంట్లో ఉన్న రఫిక్‌తో పోలీసులు ప్రశ్నించడంతో పిల్లలు నా దగ్గర లేరని, వేరే వ్యక్తి దగ్గర ఉన్నారని చెప్పాడు. రఫిక్ ఇచ్చిన సమాచారంతో అర్ధరాత్రి పోలీసులు వెతకడంతో మరో వ్యక్తి దగ్గర పిల్లలు ఉన్నట్లు గుర్తించారు.

వెంటనే పిల్లలను అదుపులోకి తీసుకున్న పోలీసులు రఫిక్‌తో పాటు మరో వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. పిల్లలను తల్లికి అప్పగించిన పోలీసులు ఇద్దరినీ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. కోపోద్రికులైన స్థానికులు రఫిక్‌ను దేహదూర్ చేశారు. పోలీసులు తమదైన శైలిలో విచారించగా పిల్లలను రూ 9లక్షలకు విక్రయించిన్నట్లు తెలిపాడు. పిల్లలను గోవాకు తరలిస్తున్నట్లు పోలీస్ విచారణ అయింది. ఈ సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News