Saturday, April 27, 2024

మోడెర్నా టీకా అద్భుతం

- Advertisement -
- Advertisement -

Fauci praises the Moderna vaccine

 

94.5% సమర్థత అంటే అది నిజంగా
గొప్ప ఫలితం
అమెరికా అంటు వ్యాధుల నిపుణుడు డా. అంటోని ఫౌచీ ప్రశంసలు

వాషింగ్టన్: కొవిడ్19 నియంత్రణకు మోడెర్నా రూపొందించిన వ్యాక్సిన్ ప్రాథమిక ఫలితాలపై అమెరికా అంటువ్యాధుల నిపుణుడు డాక్టర్ ఆంటోనీ ఫౌచీ ప్రశంసలు కురిపించారు. ‘70 శాతం, ఎక్కువలో ఎక్కువ 75 శాతం సమర్థవంతమైన టీకాతోనే తాను సంతృప్తి చెందగలనని చెప్పగలను. మన దగ్గర 94.5 శాతం సమర్థతతో పని చేసే టీకా ఉన్నదన్న విషయం ఎంతో అద్భుతం. అది నిజంగా ఎంతో గొప్ప ఫలితం.

ఇంత బాగా పని చేసే టీకా లభిస్తుందని ఎవరూ ఊహించి ఉండకపోవచ్చు’ అంటూ ఫౌచీ సంతృప్తి వ్యక్తం చేశారు. టీకా కోసం ప్రపంచమంతా ఎదురు చూస్తున్న సమయంలో సోమవారం మోడెర్నా నుంచి ఓ ప్రకటన వచ్చిన విషయం తెలిసిందే. తమ టీకా 94.5 శాతం సమర్థతను కనబరిచిందని ఆ సంస్థ తమ మధ్యంతర నివేదికను వెల్లడించింది. 30వేలమంది వాలంటీర్లపై ఈ టీకాను ప్రయోగించి పరీక్షించిన నివేదిక అది.

ఈ ఏడాది ప్రారంభంలో కరోనా వైరస్ జన్యు క్రమాన్ని చైనా వెల్లడించింది. ఆ వెంటనే ఫౌచీ నేతృత్వంలోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఎలర్టీస్ అండ్ ఇన్‌ఫెక్షియస్ డిసీజెస్(ఎన్‌ఐఎఐడి) యుఎస్ బయోటెక్ సంస్థతో కలిసి టీకా అభివృద్ధిని చేపట్టింది. ఈ టీకాలో నూతన సాంకేతికతతో రూపొందించిన మెసెంజర్ ఆర్‌ఎన్‌ఎ అనే సింథెటిక్ మాలిక్యూల్‌ను ఉపయోగించారు. ఈ రకమైన వ్యాక్సిన్‌కు ప్రపంచంలో ఇప్పటివరకూ ఆమోదం లేదు. దీనిపై కొందరు విమర్శలు కూడా చేశారని ఆయన తెలిపారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News