Monday, April 29, 2024

మోడీకి ఎన్నికల ఓటమి భయం పట్టుకుంది: చిదంబరం

- Advertisement -
- Advertisement -

Chidambaram

గోవా: ప్రధాని నరేంద్ర మోడీ ఎన్నికల్లో ఓటమి భయంతోనే మూడు వ్యవసాయ చట్టాలను ఉపసంహరించుకుంటానని ప్రకటించారని కేంద్ర మాజీ మంత్రి పి.చిదంబరం శుక్రవారం అన్నారు. “ ఈ ప్రభుత్వం ప్రజాస్వామ్యం లేక పార్లమెంట్ అంటే భయపడదు. అది కేవలం ఎన్నికల్లో ఓడిపోతానేమోనని మాత్రం భయపడుతుంది. ఒకవేళ మీరు ఈ ప్రభుత్వంను సరిచేయాలనుకుంటే మాత్రం అది ప్రతి ఎన్నికల్లో భారత ప్రజలు దాన్ని ఓడించడం ఒక్కటే మార్గం” అన్నారు. ఆయన ఎన్నికలు జరగాల్సి ఉన్న గోవాలో ఈ విషయం చెప్పారు. ఆయన ఇంకా ఈ ప్రభుత్వం తన నిరంకుశ పోకడను మానుకోలేదు, అదేమి అంత సునాయాసంగా మారిపోదు అన్నారు. “ఒక్కసారి మీరు వారిని ఓడిస్తే వారు ఐదేళ్ల వరకు తగ్గి ఉంటారు. లేదంటే మరింత అప్రజాస్వామికంగా, మూర్ఖంగా, నిర్దయగా ప్రవర్తిస్తారు” అన్నారు.

మోడీ ఉత్తర్‌ప్రదేశ్‌లో మూడు వారాల కిందటే ఎవరైతే సేద్యపు చట్టాలను వ్యతిరేకిస్తారో వారు దేశద్రోహులు అన్న విషయాన్ని చిదంబరం ఈ సందర్భంగా గుర్తుచేశారు. “నేడేమైంది? రాబోయే గోవా ఎన్నికల్లో వారు చిత్తుగా ఓడిపోతారని వారికి సూచనలు(ఫీడ్‌బ్యాక్) అందాయి. ఎన్నికల్లో ఓడిపోతామేమో అన్న భయంతోనే మోడీ హఠాత్తుగా ఉదయం 9 గంటలకు సేద్యపు చట్టాలను ఉపసంహరించాలని నిర్ణయించుకున్నారు” అని వివరించారు.

“ప్రభుత్వానికి అసలు చర్చల మీద నమ్మకమే లేదు. అది చర్చించదు. పార్లమెంటులో చర్చ జరుపదు. సేద్యపు చట్టాల మీద, ధరల పెరుగుదల మీద చర్చించడానికి ప్రభుత్వం నిరాకరించినందునే గత పార్లమెంట్ సమావేశాలు తుడిచిపెట్టుకుపోయాయి. ఎంతో మొండిగా వ్యవహరించే ప్రభుత్వం నేడు సేద్యపు చట్టాలను ఉపసంహరించబోతున్నట్లు ప్రకటించింది. ఇది ప్రజలకో పాఠం” అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News