Sunday, April 28, 2024

మోడీని ఇరుకున పెట్టిన ఆర్థిక శాఖ ప్రకటన

- Advertisement -
- Advertisement -

Finance Ministry Embarrassed PM Modi: Chidambaram

కాంగ్రెస్ నేత చిదంబరం వ్యాఖ్య

న్యూఢిల్లీ: జిఎస్‌టి పరిహారంగా రాష్ట్రాలకు రూ. 78,704 కోట్లు కేంద్రం బకాయిపడినట్లు కేద్ర ఆర్థిక మంత్రిత్వశాఖ ప్రకటించడం పట్ల సీనియర్ కాంగ్రెస్ నాయకుడు పి చిదంబరం విస్మయం వ్యక్తం చేశారు. ప్రధాని నరేంద్ర మోడీ రాష్ట్రాలను మందలించిన రోజే ఆర్థిక శాఖ ఈ విషయాన్ని బయటపెట్టి ఆయనను ఇరకాటంలో ఎందుకు పెట్టిందో తెలుసుకోవాలన్న ఆకాంక్షను చిదంబరం వ్యక్తం చేశారు. 2022 మార్చితో ముగిసిన ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రాష్ట్రాలకు చెల్లించాల్సిన జిఎస్‌టి పరిహారం బకాయిలలో ఎనిమిది నెలల బకాయిలను కేంద్రం ఇదివరకే విడుదల చేసిందని, సెస్ నిధిలో తగిన నిల్వలు లేని కారణంగా రూ. 78,704 కోట్ల బకాయిలను రాష్ట్రాలకు ఇంకా చెల్లించలేదని ఆర్థిక శాఖ బుధవారం ప్రకటించింది. అదే రోజున ప్రధాని మోడీ పెట్రోల్, డీజిల్‌పై వ్యాట్ రేటును తగ్గించుకోవాలంటూ రాష్ట్ర ముఖ్యమంత్రులను మందలిస్తూ క్లాసు తీసుకున్నారని చిదంబరం తెలిపారు. వాస్తవానికి రాష్ట్రాలకు చెల్లించాల్సిన జిఎస్‌టి బకాయిల మొత్తం ఇంకా ఎక్కువే ఉందని, కంట్రోలర్ ఆఫ్ గవర్న్‌మెంట్ అకౌంట్స్(సిజిఎ) మాత్రమే సరైన లెక్కలు చెప్పగలరని చిదంబరం ట్వీట్ చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News