Monday, April 29, 2024

17 కొత్త బిసి గురుకుల డిగ్రీ కళాశాలల్లో… ఫైన్ ఆర్ట్, హోటల్ మేనేజ్‌మెంట్ కోర్సులు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : కొత్తగా మంజూరు చేసిన 17 బిసీ గురుకుల డిగ్రీ కాలేజీలలొ ఈ ఏడాది నుంచి తరగతులు ప్రారంభం కానున్నాయి. ఆయా కాలేజీల్లో బోధించే కోర్సుల వివరాలను మహాత్మా జ్యోతిబా పూలే బిసి గురుకుల విద్యాసంస్థల కార్యదర్శి డాక్టర్ మల్లయ్య బట్టు వెల్లడించారు. వికారాబాద్ డిగ్రీ కాలేజీలో ఫైన్ ఆరట్స్ కోర్సు బిఏ(హనర్స్), – సంగారెడ్డిలో హోటల్ మేనేజ్‌మెంట్‌కోర్సు- మిగతా కాలేజీల్లో బిఎస్‌సి(ఎంపిసిఎస్), బిఎస్‌సి(బిజెడ్‌సి), బికాం, బిఏ కోర్సులు- ప్రవేశ పెట్టినట్లు వివరించారు. పేద వర్గాల వారికి ఉన్నత విద్యను అందించే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం కొత్తగా మంజారు చేసిన బిసి గురుకుల డిగ్రీ కాలేజీలు ఈ విద్యా సంవత్సరంనుంచి అందుబాటులోకి రానున్నాయన్నారు. విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని విద్యార్థులకు పిలుపునిచ్చారు.

కొత్తగా ఏర్పాటుచేసిన 17 కాలేజీల్లో వికారాబాద్ లోనిఫైన్ ఆరట్స్ కాలేజీలో ఫిల్మ్ అండ్ మీడియా, యానిమేషన్ అండ్ విఎఫ్‌ఎక్స్, ఫోటోగ్రఫి అండ్ డిజిటల్ ఇమేజింగ్ కోర్సులతో బిఎ(హనర్స్) ,సంగారెడ్డి కాలేజీలో హోటల్ మేనేజ్ మెంట్ కోర్సు నిర్వహిస్తున్నామని ఒక ప్రకటనలో ఆయన పేర్కొన్నారు. మిగతా కాలేజీల్లో బిఎస్‌సి(ఎంపిసిఎస్), బిఎస్‌సి(బిజెడ్‌సి), బికాం, బిఎ కోర్సులు అందుబాటులో ఉన్నాయన్నారు. .ఇంటర్ ఉత్తీర్ణులైన బిసి, ఎస్‌సి, ఎస్‌టి విద్యార్థులు తాము ఎంచుకున్న కాలేజీకి నేరుగా వెళ్లి డిగ్రీలో ప్రవేశానికి దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. జిల్లాకు ఒక కాలేజీ ప్రకారంగా ఇప్పటివరకు ఉన్న 16 కాలేజీలకు అదనంగా మరో 17 కాలేజీలను ముఖ్యమంత్రి కెసిఆర్ చొరవ తీసుకుని ఏర్పాటు చేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు. బిసి సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్, బిసి సంక్షేమ శాఖ ముఖ్యకార్యదర్శి బుర్రా వెంకటేశంలకు ధన్యవాదాలు తెలిపారు.

33 కాలేజీల్లో రెండు కాలేజీలు సంగారెడ్డి, వికారాబాద్ లోని డిగ్రీ కాలేజీలు కో- ఎడ్యుకేషన్ కాలేజీలు కాగా మహిళా డిగ్రీ కాలేజీలు గద్వాల్, బాన్స్ వాడా( కామారెడ్డి), ఆదిలాబాద్, ఆసిఫాబాద్, పెద్దపల్లి, ములుగు, మహబూబాబాద్, సూర్యాపేట లో ఏర్పాటు చేశామన్నారు, బాలుర డిగ్రీ కాలేజీలు నారాయణ పేట, నాగర్ కర్నూలు, మంచిర్యాల, భూపాలపల్లి, కొత్తగూడెం, భువనగిరిలలో అందుబాటులో ఉంటాయని మల్లయ్యబట్టు వివరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News