Tuesday, September 17, 2024

పాక్ నావికా సిబ్బందిపై గుజరాత్ పోలీస్ ఎఫ్‌ఐఆర్

- Advertisement -
- Advertisement -

FIR on Pak personnel
న్యూఢిల్లీ: గుజరాత్ తీరంలో అరేబియా సముద్రంలో చేపలుపడుతున్న భారతీయ మత్సకారులపై అకారణంగా కాల్పులు జరిపి మత్సకారుడిని హత్యచేసినందుకు, మరొకరిని గాయపరిచినందుకు పాకిస్థాన్ సముద్రజలాల భద్రత సంస్థ(పిఎంఎస్‌ఎ)కు చెందిన 10 మంది సిబ్బందిపై గుజరాత్ పోలీసులు ‘మర్డర్ అండ్ అటెంప్ట్ మర్డర్’ అభియోగాలు నమోదుచేశారు. పోర్బందర్ జిల్లాలోని నవీ బందర్ పోలీస్ స్టేషన్‌లో ఆదివారం రాత్ర ఎఫ్‌ఐఆర్‌ను నమోదుచేశారు. ఐపిసి సెక్షన్లు 302(మర్డర్), 307(అటెంప్ట్ టు మర్డర్), 114 (నేరం జరుగుతున్నప్పుడు ప్రోత్సాహకుడు అక్కడే ఉండడం), ఇతర ఆయుధ చట్టాల అభియోగాలను నమోదుచేసినట్లు పోలీస్ అధికారి తెలిపారు. పాక్ సిబ్బంది జరిపిన కాలుల్లో మహారాష్ట్రలోని పాల్‌ఘర్‌కు చెందిన శ్రీధర్ చమ్రే అనే వ్యక్తి చనిపోయాడు. పాక్ నావికా సిబ్బంది ఐదుగురు చొప్పున రెండు పడవల్లో వచ్చి శనివారం సాయంత్రం 4 గంటలకు కాల్పులు జరిపినట్లు ఎఫ్‌ఐఆర్‌లో నమోదుచేశారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News