Home ఆంధ్రప్రదేశ్ వార్తలు విశాఖ ఫార్మాసిటీలో భారీ అగ్నిప్రమాదం

విశాఖ ఫార్మాసిటీలో భారీ అగ్నిప్రమాదం

Fire Accident in Ramky Pharma City Visakhapatnam

అమరావతి: విశాఖను వరస ప్రమాదాలు భయపెడుతున్నాయి. పరవాడ రాంకీ ఫార్మాసిటీ సోమవారం అర్ధరాత్రి భారీ అగ్నిప్రమాదం సంభవించింది. సాల్వెంట్ ఫార్మా కంపెనీలో ట్యాంకు పేలి మంటలు అంటుకున్నాయి. మరో రెండు ట్యాంకులకు మంటలు అంటుకోవడంతో దట్టమైన పొగలు కమ్ముకున్నాయి. ట్యాంకుల్లో మిథనాల్ సాల్వెంట్ నిల్వలో ప్రమాద తీవ్రత పెరిగింది. పలుమార్లు భారీ పేలుళ్లతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురైయ్యారు.

స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న అగ్నిమాపక యంత్రాలు సుమారు ఐదు గంటలు శ్రమించి మంటలను అదుపుచేశారు. ఈ ప్రమాద సమయంలో ఫార్మా కంపెనీలో నలుగురు సిబ్బంది తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన కార్మికులను గాజువాక ఆస్పత్రికి తరలించారు. ప్రమాదంలో కెమిస్ట్ కె.శ్రీనివాస్ గల్లంతు అయినట్టు సమాచారం. ఘటనాస్థలిని డిసిపి, ఆర్డీవో పరిశీలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Fire Accident in Ramky Pharma City Visakhapatnam