Friday, May 3, 2024

బెంగళూరు ఐఐఎం వద్దగల బంగ్లాలో అగ్ని ప్రమాదం

- Advertisement -
- Advertisement -
Bangalore building fire

మంటల్లో అనేక మంది చిక్కుకున్నారని సమాచారం

బెంగళూరు: కర్నాటక రాజధాని బెంగళూరులోని ఇండియన్ ఇనిస్టిట్యుాట్ ఆఫ్ మేనేజ్ మెంట్(ఐఐఎం) వద్దనున్న ఓ బంగ్లాలో మంగళవారం అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఇంతవరకు ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని తెలుస్తోంది. కాకపోతే అగ్నిప్రమాదం చోటుచేసుకున్న ఆ బిల్డింగ్‌లో అనేక మంది చిక్కుకుపోయారని తెలుస్తోంది. అగ్నిమాపక శకటాలు మంటలు ఆర్పడానికి హుటాహుటిన ప్రమాదస్థలికి చేరుకున్నాయి. అగ్నిప్రమాదానికి గురైన ఆ బిల్డింగ్ ను ఆశ్రిత్ ఆస్పయిర్ అపార్ట్‌మెంట్ గా గుర్తించారు. అనేక అంతస్థులు ఉన్న ఆ భవనంలో మంటలు చెలరేగుతున్న దృశ్యాల వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News