Monday, May 6, 2024

వీడిన బాలాపూర్ హత్య మిస్టరీ: ఒకరికి బదులు మరొకరి హత్య..

- Advertisement -
- Advertisement -

ఒకరికి బదులు మరొకరి హత్య
రియల్ ఎస్టేట్ డబ్బులే హత్య చేసేవరకు వెళ్లింది
తెల్ల అంగి వెసుకున్నందుకు బాధితుడి హత్య
వివరాలు వెల్లడించిన ఎల్‌బి నగర్ డిసిపి సన్‌ప్రీత్ సింగ్

మనతెలంగాణ/హైదరాబాద్: ఈ నెల 22వ తేదీ అర్ధరాత్రి బాలాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన హత్య కేసు మిస్టరీని పోలీసులు చేధించారు. ఈ హత్య కేసుకు సంబంధమున్న ఐదుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. రాచకొండ కమిషనర్ క్యాంప్ కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డిసిపి సన్‌ప్రీత్ సింగ్ వివరాలు వెల్లడించారు. బాలాపూర్, ముస్తఫా కాలనీకి చెందిన మహ్మద్ పర్వేజ్, ఫర్హాన్ కలిసి రియల ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారు. వ్యాపారంలో భాగంగా పర్వేజ్ రూ.9లక్షలను ఫర్హాన్‌కు ఇచ్చాడు. ఎన్నిసార్లు అడిగినా పర్వేజ్‌కు డబ్బులు తిరిగి ఇవ్వడంలేదు. దీంతో తన దూరపు బంధువు ఆసిఫ్‌నగర్‌కు చెందిన సైఫ్ అలియాస్ షేక్ ఉస్మాన్ విషయం చెప్పాడు. హత్య చేసినందుకు రూ.2లక్షలు ఇస్తానని ఒప్పందం చేసుకున్నాడు. అతడు తన స్నేహితులు ఎండి మజార్, ఎండి రషీద్, ఎండి అక్రంకు చెప్పాడు. అందరు కలిసి ఫర్హాన్‌ను చంపివేయాలని ప్లాన్ వేశారు. పర్వేజ్ వారికి ఫర్హాన్ ఇంటిని చూపించాడు.

ఈ నెల 22వ తేదీన ఫర్హాన్ ఇంటి వద్ద ఉన్న సమయంలో చూసి ఇంట్లోను ఉన్నాడని, తెల్ల చొక్కా ధరించాడని పర్వేజ్ నిందితులను సమాచారం ఇచ్చాడు. నలుగురు నిందితులు అతడి ఇంటి బయట వేచిచూస్తున్నారు. అదే సమయంలో ఫర్హాన్ వద్ద పనిచేసే బాలాపూర్‌కు చెందిన సయిద్ మోయిన్ అలీ ఫర్హాన్ ఇంట్లో నుంచి బయటికి వచ్చి హోండా యాక్టివా ముందుకు రావడంతో అతడే ఫర్హాన్ అనుకుని కత్తులతో పొడిచి చంపివేశారు. దురదృష్టవశాత్తు సయిద్ మోయిన్ అలీ కూడా ఆ రోజు తెల్ల అంగిని వేసుకున్నాడు. దీంతో ఒకరికి బదులు మరొకరిని హత్య చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సిసిటివి ఫుటేజ్ ఆధారంగా నిందితులను గుర్తించి అరెస్టు చేశారు. నిందితుల్లో ఆసిఫ్, మజహర్, ఎండి అక్రంపై నగరంలోని వివిధ పోలీస్ స్టేషన్లలో దొంగతనాల కేసులు ఉన్నాయి. రాచకొండ పోలీస్ కమిషనర్ మహేష్ భగవత్ పర్యవేక్షణలో ఇన్స్‌స్పెక్టర్లు భాస్కర్, దేవేందర్, ఎస్సైలు వినయ్, నాగరాజు తదితరులు నిందితులను అరెస్టు చేశారు.

Five Arrested in LB Nagar Murder Case

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News