Monday, April 29, 2024

అక్టోబర్ వరకల్లా మరో ఐదు టీకాలు

- Advertisement -
- Advertisement -

Five more vaccinations until October

స్పుత్నిక్ వికి మరో 10 రోజుల్లో అనుమతి

న్యూఢిల్లీ: కరోనా నియంత్రణకు ఈ ఏడాది అక్టోబర్ వరకల్లా మరో 5 వ్యాక్సిన్లు అందుబాటులోకి వస్తాయని కేంద్ర ప్రభుత్వవర్గాలు తెలిపాయి. అందులో ఒకటి రష్యా సంస్థ ఆర్‌డిఐఎఫ్‌తో కలిసి డాక్టర్ రెడ్డీస్ ల్యాబోరేటరీస్ ఉత్పత్తి చేయనున్న స్పుత్నిక్ వి అని ఆ వర్గాలు తెలిపాయి. స్పుత్నిక్ వికి పది రోజుల్లో అనుమతి లభించనున్నట్టు ఆ వర్గాలు తెలిపాయి. ఈ టీకా ఇప్పటికే నిర్వహించిన ట్రయల్స్‌లో 92 శాతం సమర్థతను కనబరిచినట్టు చెబుతున్నారు. అమెరికాకు చెందిన జాన్సన్ అండ్ జాన్సన్ కంపెనీతో కలిసి బయొలాజికల్ ఇ సంస్థ ఉత్పత్తి చేయనున్న టీకా, సీరమ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియాతో కలిసి నొవావాగ్జ్ ఉత్పత్తి చేయనున్న టీకా, జైడస్ క్యాడిలా రూపొందించిన టీకా, భారత్ బయోటెక్ రూపొందించిన ఇంట్రానాసల్(ముక్కు ద్వారా ఇచ్చే) టీకాలకు అనుమతి ఇవ్వనున్నట్టు ఆ వర్గాలు తెలిపాయి.

జైడస్ టీకా, భారత్ బయోటెక్ నాసల్ టీకా ట్రయల్స్ డేటా అందాల్సి ఉన్నది. వ్యాక్సిన్ల సమర్థత, భద్రతకు ప్రభుత్వం ప్రథమ ప్రాధాన్యత ఇస్తుందని అధికారవర్గాలు పేర్కొన్నాయి. అన్ని అనుమతులు పూర్తయి, ఉత్పత్తి ప్రారంభమైతే స్పుత్నిక్ వి ఈ ఏడాది జూన్ చివరి వరకు, జాన్సన్, జైడస్ టీకాలు ఆగస్టులో, నొవావాగ్జ్ సెప్టెంబర్‌లో, భారత్‌బయోటెక్ నాసల్ టీకా అక్టోబర్‌లో వినియోగానికి రానున్నట్టు భావిస్తున్నారు. ప్రస్తుతం దేశంలో నిర్వహిస్తున్న టీకాల కార్యక్రమంలో భారత్ బయోటెక్ రూపొందించిన కొవాగ్జిన్, సీరమ్ ఉత్పత్తి చేస్తున్న కోవీషీల్డ్ టీకాలు మాత్రమే వినియోగిస్తున్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News