Friday, April 26, 2024

కరోనాతో ఫ్రాన్స్ మాజీ అధ్యక్షుడు గిస్కార్డ్ మృతి

- Advertisement -
- Advertisement -

France former president giscard died with corona

పారిస్: ఫ్రాన్స్ మాజీ అధ్యక్షుడు వాలేరీ గిస్కార్డ్ (94) కరోనా వైరస్‌తో మృత్యువాతపడ్డారు. గిస్కార్డ్‌కు శ్వాస సంబంధమైన లక్షణాలు ఉండడంతో ఆస్పత్రిలో చేరారు. సెప్టెంబర్‌లో కరోనా పరీక్షలు చేయగా పాజిటివ్ రావడంతో చికిత్స తీసుకుంటున్నారు. మళ్లీ అస్వస్థతకు గురికావడంతో ఆస్పత్రిలో చేరారు. ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ఐసియులో చికిత్స పొందుతూ కన్నుమూశారు. 1974 నుంచి 1981వరకు ఫ్రాన్స్ అధ్యక్షుడిగా సేవలందించారు. అతి చిన్న వయసులో ఫ్రాన్స్ అధ్యక్షుడిగా రికార్డు సృష్టించాడు. యూరోపియన్ యూనియన్ ఏర్పాటులో కీలక వ్యక్తిగా గిస్కార్డ్ వ్యవహరించారు. 1989 నుంచి 1993 వరకు యూరోపియన్ యూనియన్ కు సేవలందించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News