Friday, May 17, 2024

ప్రిలిమ్స్‌లో అర్హత సాధించిన బిసి అభ్యర్థులకు ఉచితంగా సివిల్స్ మెయిన్స్ కోచింగ్

- Advertisement -
- Advertisement -

Free Civil Mains Coaching for BC Candidates Qualifying in Prelims

 

మనతెలంగాణ/హైదరాబాద్ : సివిల్స్- 2021 ప్రిలిమ్స్‌లో అర్హత సాధించిన బిసి అభ్యర్థులకు మెయిన్స్‌కు అవసరమైన కోచింగ్‌ను ఉచితంగా అందిస్తామని బిసి సంక్షేమ శాఖ ముఖ్యకార్యదర్శి బుర్రా వెంకటేశం ఒక ప్రకటనలో వెల్లడించారు. మెయిన్స్ ఎగ్జామ్‌కి ప్రిపేర్ కావడానికి అర్హులైన వారికి అవసరమైన కోచింగ్‌ను ఉచితంగా ఇస్తామని తెలిపారు. సివిల్స్- 2021లో ప్రిలిమ్స్ సాధించిన యువత మెయిన్స్ కోచింగ్ కోసం ఈ నెల 15 తేదీలోగా బీసీ స్టడీ సర్కిల్‌కు దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు. అలాగే tsbcstudycircle.cgg.gov.in వెబ్‌సైట్‌లో తమ పేరు, వివరాలు నమోదు చేసుకోవాలని సూచించారు. తమ వివరాలతో పాటు రెండు పాస్‌ఫొటోలు జత చేయాలని అన్నారు. మరిన్ని వివరాలకు బీసీ స్టడీ సర్కిల్ ఫోన్ నెంబర్: 040 -24071178లో సంప్రదించాలని తెలిపారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News