Sunday, April 28, 2024

అవయవ దాతలకు ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు.. స్టాలిన్ ప్రభుత్వ నిర్ణయం

- Advertisement -
- Advertisement -

చెన్నై : తమిళనాడు లోని స్టాలిన్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అవయవ దాతలకు ప్రభుత్వం లాంఛనాలతోనే అంత్యక్రియలు నిర్వహిస్తామని తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ శనివారం ప్రకటించారు. అవయవ దానం విషయంలో తమిళనాడు దేశం లోనే అగ్రగామిగా ఉంది. విషాదకర పరిస్థితుల్లో తమ ఆత్మీయుల అవయవాలను దానం చేసేందుకు ముందుకు వచ్చిన కుటుంబాల నిస్వార్థమైన త్యాగాల వల్లే ఈ ఘనత సాధ్యమైంది.మరణానంతర అవయవ దానం చేయటం వల్ల ఎంతోమంది ప్రాణాలు నిలబడ్డాయనే విషయాన్ని ప్రతి ఒక్కరూ తమ బంధుమిత్రులకు తెలియజేయాలి. మిగిలిన వాళ్లు కూడా అవయవ దానం చేసేలా ప్రోత్సహించాలి. అవయవ దాతలు , వారి కుటుంబ సభ్యుల త్యాగాన్ని గుర్తించి ఆర్గాన్ డోనర్స్ అంత్యక్రియలకు రాష్ట్రం తరఫున గౌరవం ఇవ్వాలనే ఉద్దేశ్యంతో ఈ నిర్ణయం తీసుకున్నాం అని స్టాలిన్ పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News