Monday, April 29, 2024

పంజాబ్‌పై ఏం చెపుతారు?

- Advertisement -
- Advertisement -
G-23 is not Ji Huzoor 23
గాంధీలకు జి23 లేఖాస్త్రం

న్యూఢిల్లీ : పలు రాష్ట్రాలలో కాంగ్రెస్‌పార్టీలో అంతర్గత గొడవల నడుమ తిరిగి పాత జి 23 అసమ్మతి బృందం విమర్శనాస్త్రాన్ని సంధించింది. పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీకి సరికొత్తగా లేఖాస్త్రం పంపించారు. గత ఏడాది పార్టీలో నాయకత్వ వికేంద్రీకరణ, నిర్మాణాత్మక ఎన్నికలతో వ్యవస్థాగత ప్రక్షాళన జరిగితీరాలని తెలిపి సంచలనం సృష్టించిన 23 అసమ్మతి నేతలు ఇప్పుడు పంజాబ్‌లో పార్టీ ప్రహసనపై అధిష్టానం వివరణ ఇచ్చుకోవాలని ఈ లేఖలో డిమాండ్ చేశారు. పంజాబ్‌లో పలు కీలక పరిణామాలు జరుగుతున్నాయి. ఈ దశలో అనేక చికాకు ప్రశ్నలు తలెత్తుతున్నాయి. వీటికి ఎవరు సమాధానం చెపుతారు? అని పార్టీ సీనియర్ నేత కపిల్ సిబల్ ప్రశ్నించారు. ఇప్పుడు పార్టీలో ఎన్నికైన పూర్తి స్థాయి అధ్యక్షులు ఎవరూ లేరు, మరి కీలక అంశాలపై ఎవరు నిర్ణయం తీసుకుంటున్నారు? పంజాబ్‌లో ప్రధాన అంశాలపై ఎవరిది కీలక నిర్ణయం.

ఎవరు దేనిని ఎందుకు ఖరారు చేస్తున్నారో తెలియడం లేదని లేఖలో నేతలు తెలిపారు. తాము ఖచ్చితంగా జి 23 అని, అన్నింటికీ తలూపే జి హుజుర్ 23 కామని , కీలక అంశాలపై ప్రశ్నిస్తూనే ఉంటామని సిబల్ పరోక్షంగా గాంధీలపై గాండీవం ఎక్కుపెట్టారు. ఎందుకు చాలా మంది పార్టీ వీడుతున్నారు. లోపం ఎక్కడుంది. కీలక నిర్ణయాలను ఆలోచించే తీసుకుంటున్నారా? ఏ విషయం పై అయినా వెంటనే సిడబ్లుసిని పిలువండి, దీని వల్ల లోపాలను చర్చించుకునే వీలవుతుంది. పార్టీ సిద్ధాంతాలు గాలికి కొట్టుకుపొయే విధంగా ఎవరు వ్యవహరించిన తాము సహించేది లేదని ఈ లేఖలో తెలిపారు. గాంధీలు ఇంతవరకూ అమరీందర్‌సింగ్‌కు వ్యతిరేకంగా సిద్ధూకు వంత పలికారు. ఇప్పుడు సిద్ధూ పిసిసి వీడాడు. ఎన్నికల ముందు పడవను నట్టేట మధ్యలో వదిలివెళ్లినట్లు వ్యవహరించాడు. దీనికి ఎవరైనా సమాధానం ఇస్తారా? అని జి 23 లేఖలో ప్రశ్నించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News