Friday, April 26, 2024

మానుకోటలో యువతిపై నిర్భయ తరహా గ్యాంగ్ రేప్

- Advertisement -
- Advertisement -

Gang rape

 

మహబూబాబాద్ : మహబూబాబాద్ మండలం అమనగల్ గ్రామ శివారులోని ఓ మామిడి తోడలో నిర్భయ తరహాలో గ్యాంగ్ రేప్ జరిగింది. ఆరుగురు యువకులు మతి స్థిమితం సరిగాలేని ఓ యువతి(20)పై శుక్రవారం రాత్రి సుమారు 11.30 గంటల సమయంలో అత్యాచారం చేసిన ఘటన తల్లిదండ్రులు, గ్రామస్తులు గోప్యంగా ఉంచడంతో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అమనగల్ గ్రామానికి చెందిన యువతి వరంగల్ వెళ్ళి తిరిగి రావడానికి ఆలస్యం అవడంతో రాత్రి కాకతీయ ఫాస్ట్ ప్యాసింజర్ రైలులో వస్తూ వారి తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వడానికి ఫోన్ ద్వారా ప్రయత్నించగా వారు ఆమె ఫోన్ కాల్‌కు స్పందిచలేదు.

దీంతో తన స్నేహితుడైన చందు అనే వ్యక్తికి ఫోన్ చేసి తనను అమనగల్ వరకు తీసుకెళ్ళాల్సిందిగా అర్థించగా ఆ యువకుడు సందర్భాన్ని ఆసరాగా చేసుకుని రెండు ఆటో రిక్షాలలో తనతో పాటు మరో ఐదుగురు యువకులను తోడు తీసుకొచ్చి వారిని మాటున నిలిపి యువతి రాగానే ఆటోలో ఎక్కించుకొని అతని స్నేహితులతో కలిసి అమనగల్ వెళుతూ ఆటోలో అత్యాచారానికి పాల్పడుతూ, అమనగల్ గ్రామ సమీపాన గల మామిడి తోటలోకి తీసుకెళ్ళి గ్యాంగ్ రేప్‌కు పాల్పడ్డారు. తెల్లవార్లు యువతిని తమ కామవాంచకు బలి చేసే క్రమంలో సమీపాన గల రైతులు యువతి ఆర్తనాధాలు విని ఘటనా స్థలానికి చేరుకుని యువకులను బందించి యువతిని గ్రామంలోని తన తల్లిదండ్రుల చెంతకు చేర్చారు. రాత్రికి రాత్రే పోలీసుకు సమాచారం అందించి అఘాయిత్యానికి పాల్పడిన యువకులను పోలీసులకు అప్పగించి, అపస్మారక స్థితికి చేరుకున్న యువతిని మహబూబాబాద్ ఏరియా ఆసుపత్రికి తరళించారు.

కాగా యువతి ఆరోగ్య స్థితి ఇంకా కోలుకోలేదని వైద్యులు తెలుపుతున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు ఆరుగురు యువకులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఆశ్చర్యానికి గురిచేసే విషయమేమిటంటే యువతిపై అత్యాచారానికి పాల్పడిన ఆరుగురు యువకులు గిరిజన మైనర్లు కావడం, గిరిజన (లంబాడా) సామాజిక వర్గానికి చెందినవారై ఉండడం. ఇటీవలి కాలంలో దిశ కేసులో అత్యాచారానికి పాల్పడిన యువకులను ఎన్‌కౌంటర్ చేసి చంపినప్పటికీ, నేరాలకు శిక్షలు ఎంత కఠినంగా ఉంటున్నప్పటికీ అత్యాచారానికి పాల్పడే మానవ మృగాలలో మార్పు రాకపోవడం గమనార్హం.

కులంతో సంబంధం లేకుండా నేరస్తులను చట్టపరంగా శిక్షించాలి.
– గుగ్గిల్ల పీరయ్య, ఎమ్.ఆర్.పి.ఎస్. జాతీయ కార్యదర్శి

యువతిపై గ్యాంగ్ రేప్‌కు పాల్పడిన యువకులు గిరిజన (లంబాడా) సామాజిక వర్గానికి చెందినవారని, అగాయిత్యానికి పాల్పడినవారు ఏ కులానికి చెందినవారైనప్పటికీ వారిని రాజ్యాంగ స్పూర్తితో చట్టపరంగా కఠిన శిక్షలు అమలు చేయాలని, కుల, మతపరమైన వెసులుబాట్లు నేరాలకు పాల్పడేవారికి వర్తించదని, ఏ కులమైనా నేరానికి తగిన శిక్ష చట్టపరంగానే ఉండాలని ఎమ్.ఆర్.పి.ఎస్. జాతీయ కార్యదర్శి గుగ్గిళ్ళ పీరయ్య వ్యాఖ్యానించారు.

Gang rape on young woman at Mahabubabad
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News