Wednesday, May 8, 2024

హర్భజన్ దంపతులకు పుత్రోత్సాహం

- Advertisement -
- Advertisement -

Geeta Basra and Harbhajan welcome baby boy

 

హైదరాబాద్ : టీమిండియా మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ మరోసారి తండ్రి అయ్యాడు. ఆయన భార్య గీతా బస్రా మగపిల్లాడికి జన్మనిచ్చింది. ఈ విషయాన్ని హర్భజన్ సింగ్ తన ఇంస్టాగ్రామ్ వేదికగా తెలియజేశాడు. తన భార్య మగబిడ్డకు జన్మనిచ్చినట్లు.. తల్లి బిడ్డా క్షేమంగా తెలిపాడు. అంతేకాదు.. అందమైన సాక్స్ లను ఫోటో జతచేసి.. పిల్లాడి రాకతో తాము ఎంత సంతోషంగా ఉన్నామో సింబాలిక్ గా చెప్పకనే చెప్పాడు హర్భజన్ సింగ్. హర్భజన్, గీత దంపతులకు ఇప్పటికే ఓ కుమార్తె ఉంది. 2016 లో ఈ దంపతులు మొదటిసారిగా తల్లిదండ్రులయ్యారు. ఆ పాపకు హీర్ ప్లాహా అనే పేరు పెట్టారు. గీతా బాలీవుడ్ లో ‘దిల్ దియా హై’, ‘ది ట్రైన్’ వంటి పలు సినిమాల్లో నటించింది. గీత, హర్భజన్ లు ప్రేమించుకుని 2015 లో పెళ్లి చేసుకున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News