Saturday, April 27, 2024

విజయోత్సవ ర్యాలీలు నిషేధం

- Advertisement -
- Advertisement -

విజయోత్సవ ర్యాలీలు నిషేధం
48 గంటల వరకు నిషేధాలు అమలు
జిహెచ్‌ఎంసి ఫలితాల తర్వాత టపాసులు కాల్చవద్దు
లెక్కింపు కేంద్రాల వద్ద మూడంచెల భద్రత
144 సెక్షన్ అమలు,200 మీటర్ల వరకూ నిషేధాజ్ఞలు

మనతెలంగాణ/హైదరాబాద్: జిహెచ్‌ఎంసి ఎన్నికల ఫలితాల తర్వాత ఎలాంటి ర్యాలీలు, టాపాసులు కాల్చడం, ఊరేగింపులు, సంబరాలు చేయడంపై నిషేధం ఉన్నట్లు ముగ్గురు పోలీస్ కమిషనర్లు స్పష్టం చేశారు. ఈ నిషేధాలు 48 గంటల పాటు అమలులో ఉంటాయని తెలిపారు. నిబంధనలు ఎవరు ఉల్లంఘించినా వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జిహెచ్‌ఎంసి ఎన్నికల ఓట్ల లెక్కింపు శుక్రవారం నిర్వహించనున్నారు. కౌంటింగ్ కేంద్రాలకు 200 మీటర్ల పరిధిలో ఎవరికీ అనుమతి ఉండదు. లెక్కింపు కేంద్రాల వద్ద 144 సెక్షన్‌ను అమలు చేయనున్నారు. ఓట్ల లెక్కింపు కేంద్రాల వద్ద నలుగురు కంటే ఎక్కువ మంది గుమికూడి ఉండకూడదు. అలాగే అనుమతి ఉన్న వారికి మాత్రమే కౌంటింగ్ కేంద్రంలోకి ప్రవేశం కల్పిస్తామని పోలీసులు తెలిపారు. హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంజనీకుమార్, సైబరాబాద్ పోలీస్ కమిషనర్ విసి సజ్జనార్, రాచకొండ సిపి మహేష్ భగవత్ లెక్కింపు కేంద్రాలను పరిశీలించారు. హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో 15 లెక్కింపు కేంద్రాలు ఉండగా వాటిలో ఒకటి సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని సనత్‌నగర్‌లో ఉంది. రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఆరు కేంద్రాల్లో ఓట్లను లెక్కించనున్నారు. సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని సనత్‌నగర్ జిహెచ్‌ఎంసి స్పోర్ట్ కాంప్లెక్స్‌లో, రాజేంద్రనగర్, మూసాపేట, కూకట్‌పల్లి తదితర కేంద్రాల్లో కేంద్రంలో ఓట్లను లెక్కించనున్నారు.
ట్రాఫిక్ మళ్లింపు…
ఓట్ల కేంద్రాల వద్ద ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తూ ముగ్గురు పోలీస్ కమిషనర్లు ఉత్తర్వులు జారీ చేశారు. లెక్కింపు కేంద్రాల వద్దకు వచ్చే వారు వారి వాహనాలను పార్కింగ్ చేసేందుకు స్థలాన్ని కేటాయించారు. పాసులు ఉన్న వారు మాత్రమే కేంద్రాలకు రావాల్సి ఉంటుంది, వాహనాలను వారికి కేటాయించిన ప్రాంతంలోనే పార్కింగ్ చేయాల్సి ఉంది.
మూడంచెల భద్రత…
ఓట్ల లెక్కింపు కేంద్రాల వద్ద పోలీసులు ముండచెల భద్రతను ఏర్పాటు చేశారు. మొదటి స్థాయిలో టిఎస్‌ఎస్‌పి, రెండో అంచెలో సిఏఆర్, మూడో అంచెలో స్థానిక పోలీసులు భద్రతగా ఉంటారు. లెక్కింపు కేంద్రాల వద్ద కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. ప్రతి టేబుల్ వద్ద ఎస్సై,ముగ్గురు పోలీసులను నియమించారు. వీరు బాక్స్‌ను స్ట్రాంగ్ రూము నుంచి రావడం నుంచి లెక్కింపు వరకు పర్యవేక్షించనున్నారు. రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో 5,000 మందితో భద్రతను ఏర్పాటు చేశారు. అలాగే ఓట్ల లెక్కింపును వీడియో తీయనున్నారు.

GHMC Polls Results: Victory rallies not allowed in Hyd

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News