Saturday, April 27, 2024

పోలీసులకు హోంమంత్రి అభినందనలు

- Advertisement -
- Advertisement -

Home Minister Mahmood Ali congratulates TS police

హైదరాబాద్‌ః దేశవ్యాప్తంగా అత్యుత్తమమైన 10 పోలీస్ స్టేషన్లలలో కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ కు చెందిన జమ్మికుంట పోలీస్ స్టేషన్ ఎంపిక కావడం పట్ల రాష్ట్ర హోంశాఖ మంత్రి మహమ్మద్ మహమూద్ అలీ హర్షం వ్యక్తం చేశారు. 2020 సంవత్సరానికి గాను కేంద్ర ప్రభుత్వం ఎంపిక చేసిన పది పోలీస్స్టేషన్లలో తెలంగాణ రాష్ట్రంలోని పోలీస్ స్టేషన్ ఎంపిక కావడం పై పోలీస్ అధికారులను హోం మంత్రి అభినందించారు. రాష్ట్ర డిజిపి మహేందర్ రెడ్డిని, కరీంనగర్ కమిషనర్ కమల్ హాసన్ రెడ్డిని, జమ్మికుంట పోలీస్ సిబ్బందిని హోంమంత్రి ప్రశంసించారు. ఉత్తమ పౌర సేవలు పోలీసింగ్ అమలుకు గాను 2019 సంవత్సరం లో కరీంనగర్ కు చెందిన చొప్పదండి పోలీస్ స్టేషన్ ఉత్తమ పోలీస్ స్టేషన్ ఎంపికైన విషయం విదితమే. వీటిని స్ఫూర్తిగా తీసుకుని రాష్ట్రంలోని ఇతర పోలీస్ స్టేషన్లో అధికారులు ఉత్తమ పోలీస్ స్టేషన్ లు గా ఎంపిక అయ్యేందుకు కృషి చేయాలని హోంమంత్రి సూచించారు.

Home Minister Mahmood Ali congratulates TS police

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News