Sunday, April 28, 2024

బాలికపై అఘాయిత్యానికి పాల్పడిన పెద్దనాన్న

- Advertisement -
- Advertisement -

girl was sexually abused in Hyderabad

జగద్గిరిగుట్ట: హైదరాబాద్ లోని జగద్గిరిగుట్టలో ఆదివారం దారుణం సంఘటన వెలుగులోకి వచ్చింది. తన ఇంట్లో ఉంటున్న తమ్ముడి తమ్ముడి కుమార్తెపై పెద్దనాన్న అఘాయిత్యానికి పాల్పడ్డాడు. రాములు అనే వ్యక్తి కూతురు అయ్యే బాలికను బెదిరించి కొన్ని రోజుల నుంచి అత్యాచారానికి పాల్పడుతున్నాడు. ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించాడు. దీంతో బాలిక మౌనంగా ఉండిపోయింది. ఈ మధ్యకాలంలో కుటుంబసభ్యులకు అనుమానం రావడంతో ఆస్పత్రికి తీసుకెళ్లి వైద్య పరీక్షలు చేయించారు. అందులో బాలిక గర్భం దాల్చినట్టు తెలిసింది. బాలికను తల్లిదండ్రులు నిలదీయడంతో అసలు విషయాన్ని చెప్పింది. బాలిక నోట్లో రుమాలు కుక్కి నాలుగుసార్లు అత్యాచారానికి పాల్పడినట్లు బాధితురాలు తెలిపింది. తల్లిదండ్రుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

 

girl was sexually abused in Hyderabad

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News