Saturday, April 27, 2024

‘కరోనా’ టాబ్లెట్ ధర తగ్గించిన గ్లెన్మార్క్

- Advertisement -
- Advertisement -

Glenmark drops Covid19 drug Favipiravir price to Rs 75

కోవిడ్19 చికిత్స మందును 27 శాతం తగ్గించిన గ్లెన్మార్క్ ఫార్మా
న్యూఢిల్లీ: కోవిడ్ -19 చికిత్సకు ఉపయోగించే యాంటీవైరల్ డ్రగ్ ఫావిపిరవిర్ ధరను 27 శాతం తగ్గించినట్టు ఫార్మాస్యూటికల్ కంపెనీ గ్లెన్మార్క్ ఫార్మాస్యూటికల్స్ ప్రకటించింది. దీంతో ‘ఫ్యాబిఫ్లూ’ బ్రాండ్ కింద ఫావిపిరవిర్ టాబ్లెట్ రూ.75కే లభ్యం కానుంది. సంస్థ ఈ మందును ‘ఫ్యాబిఫ్లూ’ బ్రాండ్ పేరుతో మార్కెట్లో విడుదల చేసింది. గత నెలలో ఈ టాబ్లెట్‌కు రూ.103 ధరను గ్లెన్‌మార్క్ ఫార్మాస్యూటికల్స్ ప్రారంభించింది. అయితే ఇప్పుడు దీనిని రూ.75కు తగ్గించినట్టు రెగ్యులేటరీ ఫైలింగ్‌లో కంపెనీ వెల్లడించింది. భారతదేశంలో ‘ఫ్యాబిఫ్లూ’ టాబ్లెట్ ధర రూ.103 చొప్పున విడుదల చేయగా, రష్యాలో టాబ్లెట్‌కు రూ.600, జపాన్‌లో రూ.378, బంగ్లాదేశ్‌లో రూ.350, చైనాలో టాబ్లెట్‌కు రూ.215 ధర నిర్ణయించారు.

గ్లెన్మార్క్ ఫార్మాస్యూటికల్స్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్, హెడ్(ఇండియా బిజినెస్) అలోక్ మాలిక్ మాట్లాడుతూ, ఈ ఔషధం ఇతర దేశాల కన్నా తక్కువ ధరకే భారతదేశంలో విడుదల చేసినట్లు తమ అంతర్గత విశ్లేషణలు తెలుపుతున్నాయని అన్నారు. దీనికి ప్రధాన కారణం కంపెనీ ఇండియన్ ప్లాంట్‌లో ముడి పదార్థాలు (ఎపిఐలు) వల్ల సంస్థకు వ్యయ ప్రయోజనం చేకూరింది. ఈ ప్రయోజనం ఇప్పుడు దేశ ప్రజలకు బదిలీ చేశామని, ధరలను తగ్గించడం వల్ల దేశంలోని రోగులకు ఈ ఔషధం మరింత అందుబాటులోకి వస్తుందని ఆశిస్తున్నామని అన్నారు. ఓపెన్-లేబుల్, మల్టీసెంటర్, సింగిల్ థెరపీ అధ్యయనంలో భాగంగా 1000 మంది రోగులలో ఔషధ ప్రభావం, భద్రతను నిశితంగా పరిశీలించడానికి ఫ్యాబిఫ్లూపై పోస్ట్ మార్కెటింగ్ నిఘా ప్రారంభించినట్లు కంపెనీ ప్రకటించింది. జూన్ 20న గ్లెన్‌మార్క్ తయారీ, మార్కెటింగ్ కోసం భారతదేశం డ్రగ్ రెగ్యులేటర్ నుండి ఫ్యాబిఫ్లూ కోసం అనుమతి పొందింది. దీంతో స్వల్ప, మధ్యస్థాయి కోవిడ్ -19 సోకిన రోగులకు ఇది ఆమోదం పొందిన మొట్టమొదటి ఔషధంగా మారింది. మార్కెట్లో విక్రయించడానికి అనుమతి అందుకుంది. దేశంలో ఇన్ఫెక్షన్ ఉన్న కోవిడ్ -19 రోగుల కోసం రూపొందించిన డ్రగ్ మూడో దశ క్లినికల్ ట్రయల్‌ను కూడా పూర్తి చేసినట్లు కంపెనీ తెలిపింది. పరీక్ష ఫలితాలు త్వరలో వెల్లడికానున్నాయి.

Glenmark drops Covid19 drug Favipiravir price to Rs 75

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News