Saturday, April 27, 2024

చెరువుల అభివృద్ధికి ప్రభుత్వం కృషి

- Advertisement -
- Advertisement -

మునిపల్లి: చెరువుల అభివృద్ధ్దికి తెలంగాణ ప్రభు త్వం కృషి చేస్తుందని అందోల్ ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల సందర్భంగా ఊరూర పండుగ ఉత్సావల్లో భాగంగా గురువారం మండలంలోని పెద్దగోపులారం బు గ్గ రామన్న చెరువు గట్టుపై నిర్వహించిన ఊరూర పండుగ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే క్రాంతికిరణ్ హాజరై స్థానిక మహిళా ప్ర జాప్రతినిధులతో కలిసి బతుకమ్మ ఉత్సవాలో పాల్గొన్నారు. అనంతరం బతుకమ్మలను చెరువులో వదిలారు. ఎమ్మెల్యే క్రాంతికిరణ్ మాట్లాడు తూ గత పాలకుల వల్ల చెరువులు నీళ్లు లేక ఎడారిలా ఉండేవని గుర్తు చేశారు.

కాని తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ కాకతీయ పథకంతో చెరువులన్నీ నిండు కుండలా జలకళతో కళకళలాడుతున్నాయన్నారు. అందుకు చెరువుల్లో నీళ్లు ఉండడంతో రైతుల కళ్లల్లో ఆనందం వెల్లువిరుస్తుందన్నారు. జడ్‌పిటిసి పైతర మీనాక్షి సా యికుమార్, ఎంపిపి శైలజ శివశంకర్,తహశీల్దార్ శివకుమార్, ఎంపిడిఓ హరినందన్‌రావు, రాయికోడ్ మార్కెట్ కమిటీ చైర్‌పర్సన్ నవీత, ఎంపిఓ అంజనీదేవి, బిఆర్‌ఎస్ రాష్ట్ర నాయకుడుపైతర సాయికుమా ర్, బిఆర్‌ఎస్ మండల ప్రధాన కార్యదర్శి శశికుమార్, యూత్ అ ధ్యక్షుడు ఆనంద్, గ్రామ సర్పంచ్ కీర్తికుమార్, నాయకులున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News