Monday, April 29, 2024

కాకతీయ సప్తాహం

- Advertisement -
- Advertisement -

నేటి నుంచి ఏడు రోజుల పాటు ఉత్సవాలు నేడు వరంగల్‌కు కాకతీయ
వారసుడు కమల్ చంద్ర బంజ్ దేవ్ చరిత్రకు జీవం ప్రభుత్వం

మన తెలంగాణ/వరంగల్ బ్యూరో: కాకతీయుల వంశం ప్రతాపరుద్రునితో ముగిసిపోయిందని అనుకుంటే వారి వారసు లు ఇంకా సజీవంగా ఉన్నారని తెలంగాణ ప్రభుత్వం 22వ వారసుడిని నేడు వరంగల్ నగరానికి తీసుకురావడం ద్వారా రుజువు చేయనుంది. ‘కాకతీయ వైభవ సప్తాహం’ పేరుతో నేటి నుంచి ఏడు రోజుల పాటు ప్రభు త్వం వరంగల్‌లో నిర్వహించనున్న ఉత్సవాల సందర్భంగా కాకతీయ 22వ వారసుడు కమల్ చంద్ర బంజ్ దేవ్ నేడు ఇక్కడకు వచ్చి సప్తాహాలను ప్రారంభించనున్నారు. ఇందుకు సంబంధిం చి ప్రభుత్వ యంత్రాంగం తగిన ఏర్పాట్లు చేసింది. ఓరుగల్లును కేంద్రంగా తీసుకుని పరిపాలనాచేసిన కాకతీయ రాజులు ప్రతాప రుద్రునితో వారి శకం ముగిసిందని 800 వందల ఏళ్ల చరిత్రను చె ప్పుకుంటూ వచ్చారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత పరిపాలన చరిత్ర ప్రధానంగా వారు నిర్మించిన గొలుసుకట్టు చెరువుల నిర్మాణం నేటికి చెదరకుండా ఉన్నాయి. ముఖ్యమంత్రి కెసిఆర్ సా గునీటి వనరులను అభివృద్ధి పరచాలనే ఉద్దేశ్యం తో కాకతీయుల నిర్మించిన చెరువుల పూడికతీతకు మిషన్ కాకతీయ పేరుతో ఆ కార్యక్రమాన్ని యుద్ధప్రాతిపదికన పూర్తిచేయడం అనుకున్న లక్షం నెరవేరింది. అప్పటినుండి కాకతీయుల చరిత్ర వారి వంశంపై ఫోకస్ పెట్టిన ప్రభుత్వం నాలుగు సంవత్సరాల క్రితం చత్తీస్‌ఘడ్ రాష్ట్రంలో వారి వారసులు ఉన్నట్లు తెలుసుకోగలిగింది.

గణపతి దేవుని ఆధ్వర్యంలో రాణిరుద్రమ, ప్రతాప దేవుడు వరంగల్ ప్రాంతాన్ని సాగునీటి రంగంలో అగ్రగామిగా నిలపడం వలన వారి చరిత్ర ఈ ప్రాంతంలో మధ్యతరహా ప్రాజెక్ట్‌లైన రామప్ప, లక్నవరం, పాకాల, గణపురం చెరువుల రూపంలో సజీవంగా నిలిచింది. కాకతీయుల వారసులు నేటికీ ఉన్నారని తెలియడంతో ఈ ప్రాంత ప్రజలు ఆశ్చర్యానికి గురయ్యారు. వాస్తవానికి 18వ శతాబ్దంలో ఢిల్లీ సుల్తానుల చేతిలో బందీ అయిన ప్రతాప రుద్రుడుని తీసుకుని వెళుతుండగా కాళేశ్వరం నదీ పరివాహకంలో అదృశ్యమైనట్లు చరిత్ర చెబుతుంది, అతని ద్వారానే కాకతీయుల వంశం చత్తీస్‌ఘఢ్ రాష్ట్రంలోని బస్తర్ ప్రాంతంలో మరో సామ్రాజ్యాన్ని నిర్మించినట్లు ఆధారాలు కనబడుతున్నాయి. ఓరుగల్లు రాజ్యాన్ని విడిచిన తర్వాత బస్తర్‌ను కేంద్రంగా చేసుకుని వారి సామ్రాజ్య పరిపాలన కొనసాగిస్తూ వచ్చారు. రాజరిక పరిపాలనను సమాప్తం చేసిన తరువాత వారు అదే ప్రాతంలో ఉండి ప్రాంత ప్రజలకు వారికి ప్రత్యక్ష దేవుళ్లుగా సేవలు అందింస్తున్నారు.

కాగా, ఇంతటి ప్రతిష్టాత్మక వేడుకలకు కాకతీయుల వంశంలోని 22వ వారసుడు రాజా కమల్ దేవ్ చంద్ర బంజ్‌దేవ్‌ను ఆహ్వానించి ఆయన చేతులమీదుగా కాకతీయ సప్తాహం వేడుకలను ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు సిఎం కెసిఆర్ ఆదేశాల మేరకు ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ నేతృత్వంలో అధికారుల బృదం బస్తర్‌లో ఉన్న కమల్ చంద్రబంజ్ దేవ్‌ను కలిసి స్వయంగా వరంగల్‌కు ఆహ్వానించారు. ఈ ఆహ్వానం సమాచారం తెలంగాణ ప్రజలకు తెలియడంతో కాకతీయ వారసులు వరంగల్ కు వస్తున్నారన్న సమాచారాన్ని తెలుసుకుని ఆశ్చర్యానికి లోనయ్యారు. దాదాపుగా 15 రోజులుగా కాకతీయ వారసులు వరంగల్‌కు వస్తున్నారంటే ప్రభుత్వం ఘనమైన ఏర్పాట్లను చేపట్టింది. నేడు కాకతీయుల 22వ వారసుడు కమల్‌చంద్ర బంజ్ దేవ్‌చేతుల మీదుగా వేడుకలను ప్రారంభించనున్నందున అంతటా ఉఠ్కంత నెలకొంది, 800 ఏళ్ల చరిత్రకు సజీవ సాక్షంగా కమల్‌చంద్ర బంజ్‌దేవ్ వరంగల్‌లో అడుగుపెట్టడం ముగిసిన చరిత్రకు తెలంగాణ ప్రభుత్వం మళ్లీ నూతన చరిత్రను లిఖించబోతుందని మేథావులు సైతం అంటున్నారు. కాకతీయుల సామ్రాజ్యంలో సాగునీటిరంగం అద్భుతమైన ఫలితాలను చూపించినందున అదే స్ఫూర్తితో కాకతీయ వారసులకు రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తుందంటున్నారు.

ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా భారీ వేడుకలు..

కాకతీయులు నిర్మించిన కోటగుళ్లలో ప్రభుత్వం భారీ ఎత్తున వేడుకలను నిర్వహించేందుకు ఘనమైన ఏర్పాట్లను చేసింది. వాటి నిర్వహణ జిల్లా కలెక్టర్లు, ప్రజాప్రతినిధుల సమన్వయంతో నిర్వహిస్తారు. 7 రోజులపాటు జరిగే వేడుకలలో రోజుకు ఒక కార్యక్రమం వారీగా ప్రణాళికాబద్ధంగా సప్తాహం కార్యక్రమం నిర్వహించనున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News