Friday, April 26, 2024

గ్లోబ‌ల్ ఇండియా రూప‌శిల్పి పివి: కెసిఆర్

- Advertisement -
- Advertisement -

Greatest economist is PV Narasimha rao

హైదరాబాద్: నూత‌న ఆర్థిక సంస్క‌ర‌ణ‌ల‌కు మాజీ ప్రధాని పివి నరసింహారావు శ్రీకారం చుట్టడంతో పాటు సమర్థవంతంగా అమలు చేశారని సిఎం కెసిఆర్ తెలిపారు. భార‌త మాజీ ప్ర‌ధాని పివి న‌ర‌సింహారావుకు భార‌త‌ర‌త్న ఇవ్వాల‌ని డిమాండ్ చేస్తూ సిఎం కెసిఆర్ తెలంగాణ అసెంబ్లీలో తీర్మానం ప్ర‌వేశ‌పెట్టారు. ఈ సందర్భంగా ఆయన సభలో మాట్లాడారు. రాజ‌కీయాల‌తో సంబంధంలేని ఆర్థిక‌వేత్త మ‌న్మోహ‌న్‌ను ఆర్థిక శాఖ మంత్రిగా నియ‌మించారని,  స‌రళీకృత విధానాల‌తో దేశ ఆర్థిక గ‌మ‌నాన్ని మార్చివేశారని కొనియాడారు.  పివి బహుముఖ ప్ర‌జ్ఞ‌శాలి, బహుభాషా కోవిదుడని, గ్లోబ‌ల్ ఇండియా రూప‌శిల్పి పివి అని మెచ్చుకున్నారు. నూత‌న ఆర్థిక సంస్క‌ర‌ణ‌లు చేప‌ట్టారని ప్రశంసించారు. ఆత్మ‌గౌర‌వ ప‌తాక అయిన పీవీ శ‌త జ‌యంతి ఉత్స‌వాల‌ను సంవ‌త్స‌రం పాటు నిర్వ‌హించేందుకు ప్ర‌భుత్వం నిర్ణ‌యం తీసుకుందని. దేశానికి చేసిన సేవ‌ల‌ను ప్ర‌జ‌లంద‌రూ స్మ‌రించుకోవాల‌ని తెలంగాణ ప్ర‌భుత్వం వెల్లడించింది. దాదాపు మూడు ద‌శాబ్దాలు చైనా స‌రిహ‌ద్దు ప్ర‌శాంతంగా ఉండ‌డానికి పివినే కార‌ణంమని, భూసంస్క‌ర‌ణ‌ల‌ను చిత్త‌శుద్దితో అమ‌లు చేశారని, రాష్ర్ట విద్యామంత్రిగా గురుకుల పాఠ‌శాల‌లు ప్రారంభించారని, కేంద్రంలో మాన‌వ వ‌న‌రుల శాఖ మంత్రిగా న‌వోద‌య విద్యాల‌యాలు ప్రారంభించారని గుర్తు చేశారు. ఈ విద్యాల‌యాల్లో చ‌దివిన వారు ఎంద‌రో ఉన్న‌త ప‌ద‌వుల్లో ఉన్నారు. తెలుగు అకాడ‌మీని నెల‌కొల్పిన ఘ‌న‌త కూడా పీవీకే ద‌క్కుతుంద‌ని కెసిఆర్ గుర్తు చేశారు. ఈ క్రమంలోనే తెలంగాణలోని హైద‌రాబాద్ సెంట్ర‌ల్ యూనివ‌ర్సిటీ(హెచ్‌సియు)కి పివి పేరు పెట్టాలని కెసిఆర్ కేంద్రాన్ని కోరారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News