Saturday, April 27, 2024

ముహూర్తానికి ముందు ప్రియుడితో లేచిపోయిన వధువు…

- Advertisement -
- Advertisement -

Groom marriage bride sister

భువనేశ్వర్: పెళ్లికి గంట ముందు వధువు ప్రియుడుతో లేచిపోవడంతో వరుడు ఆమె చెల్లెలను పెళ్లి చేసుకున్నాడు. చివరలో పోలీసులు వరుడి కుటుంబ సభ్యులకు షాక్ ఇచ్చారు. ఈ సంఘటన ఒడిశాలోని కలహండి జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. వరుడు కుటుంబ సభ్యులు, బంధువులు పెళ్లి మండపానికి వచ్చారు. పెళ్లి కార్యక్రమం జరుగుతోంది. వరుడు పెళ్లి పీఠలపై కూర్చున్నాడు. పెళ్లి కుమార్తెను తీసుకరావాలని పూజారి ఆమె తల్లిదండ్రులకు తెలిపాడు. ఇంతలో అందరూ గుసగుసలాడుకుంటున్నారు. పెళ్లి కూతురు ప్రియుడితో లేచిపోయిందని తెలియగానే అందరూ షాక్‌కు గురయ్యారు. వరుడు మాత్ర విస్తూపోయి పెళ్లి పీఠలపైనే కూర్చున్నాడు. అదే ముహూర్తానికి పెళ్లి కుమార్తె చెల్లెలుతో అతడికి పెళ్లి చేశారు. పెళ్లి జరిగిన కాసేపటికి పోలీసులు పెళ్లిమండపానికి చేరుకొని మైనర్ పెళ్లి చేసుకోవడం కుదరదని హెచ్చరించడంతో పాటు పెళ్లిని రద్దు చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News